జీవవైవిధ్య సదస్సుకు చురుగ్గా ఏర్పాట్లు
హైదరాబాద్: జీవ వైవిధ్య సదస్సులో తీర్మానానికి ఈ నెలలో పేరు ఖరారు చేయనున్నారని రాష్ట్ర జీవ వైవిధ్యమండలి అధ్యక్షులు డాక్టర్ అంపయ్య వెల్లడించారు. ఇవాళ సచివాలయంలో మాట్లాడుతూ ఆయన ఇందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయాని, హైటెక్స్ సమీపంలో ప్రత్యేక మ్యూజియం, ఫైలాస్ నిర్మాణాలు చేపట్టినట్లు వివరించారు. ఈ ఏడాది అక్టోబరు ఒకటినుంచి 19 వరకు జరిగే ఈ అంతర్జాతీయ సదస్సుకు 193 దేశాల ప్రతినిధులు హాజరవుతున్నారని చెప్పారు. మొత్తం 20 వేల మంది వరకు ప్రతినిధులు వివిధ అంశాలపై తాము పరిశోధించిన, పరిశీలించిన అంశాలు సదస్సులో సమర్పిస్తారన్నారు.