ప్రజలకు పౌర హక్కులపై అవగాహన ఉండాలిప్రజలకు పౌర హక్కులపై అవగాహన ఉండాలి
మోత్కూరు డిసెంబర్ 1 జనంసాక్షి : భారత రాజ్యాంగం ద్వారా కల్పించిన పౌరహక్కులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని మోత్కూరు తహశీల్దారు షేక్ అహ్మద్ అన్నారు. మోత్కూరు మండలంలోని దాచారం గ్రామంలో పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్న వాటిని పరిష్కరించడమే పౌర హక్కుల సాధన అని అన్నారు. జాతి, మతం, కులం, లింగం బేధం, పౌర హక్కులు అనేది చట్టాల ద్వారా ఏర్పడిన హక్కుల సముదాయమని జిల్లా ఎస్సి, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు దాసరి తిరుమలేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్.ఐ శ్రీనివాస్, ఎస్సి బాలికల హాస్టల్ వార్డెన్ ప్రసన్న, పంచాయితీ కార్యదర్శి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
ప్రజలకు పౌర హక్కులపై అవగాహన ఉండాలి




