దోమ జనవరి 27(జనం సాక్షి)
దోమ మండల పరిధిలోని బుద్లాపూర్ గ్రామానికి చెందిన జర్పుల జయరామ్ ను వికారాబాద్ జిల్లా కాంగ్రెస్స్ పార్టీ ఎస్టీ సెల్ కార్యదర్శిగా నియమించడం జరిగింది.ఈ సందర్భంగా జర్పుల జయరామ్ మాట్లాడుతూ డిసిసి అధ్యక్షులు టి.రామ్మోహన్ రెడ్డి తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడుతూ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రావటమే లక్ష్యంగా తన వంతు కృషి చేస్తానని అలాగే తనకు ఈ పదవి కేటాయించిన టి.రామ్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పరిగి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భూమున్న గారి పరశురాం రెడ్డి, పట్టణ ఉపాధ్యక్షులు ఎజాస్, యూత్ కాంగ్రెస్ నాయకులు రామకృష్ణారెడ్డి, షోయబ్,శ్రీకాంత్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ఎస్టీ సెల్ కార్యదర్శి గా జర్పుల జయరామ్




