గద్వాల నడిగడ్డ, జనవరి 27 (జనం సాక్షి);జోగుళాంబ గద్వాల జిల్లా నూతన ఎస్పీగా 2012 బ్యాచ్ కి చెందిన కె. సృజన శుక్రవారం బాధ్యతలు స్వీకరించారుప్రస్తుత ఎస్పీ జె. రతన్ కుమార్ నుండి కె. సృజన బాధ్యతలు స్వీకరించారు.2012బ్యాచ్ గ్రూప్ -1 అధికారి అయిన ఎస్పీ డి. ఎస్పీ, అడిషనల్ ఎస్పీ గా వివిధ ప్రాంతాలలో సేవలు అందించారు.ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో తనకు విధులు నిర్వహించిన అనుభవం ఉందనీ, ఇక్కడి ప్రజలు ఎంతో సౌమ్యులుగా ఉంటారని అన్నారు. ప్రజలకు మంచి సేవలు అందించేందుకు మీడియా, ప్రజల సపోర్టు అవసరం అని అన్నారు.
నేరాలు జరిగాక కేసులు చేదించేకన్న ముందుగానే నేరాలు జరుగకుండా తగు చర్యలు తీసుకునేందుకు మొదటి ప్రాధాన్యం ఇస్తామని అందుకు ప్రజల సపోర్టు ఉండాలనీ, ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్న పోలీస్ వారికి తెలియజేయాలని అన్నారు. ప్రజలతో ఫ్రెండ్లీ పోలీసింగ్ ను కొనసాగిస్తామని, అలాగే క్రిమినల్స్ కు, ఆంటీ ఎలిమెంట్స్ కొనసాగించే వారికి ఫ్రెండ్లీ పోలీసింగ్ వర్తించదని అన్నారు.జోగుళాంబ గద్వాల జిల్లా కు 6వ ఎస్పీ గా శుక్రవారం బాధ్యతలు స్వీకరించిన ఎస్పీ కె. సృజన కి జిల్లా డి. ఎస్పీ ఎన్. సి హెచ్ రంగ స్వామి, కార్యాలయ ఏ. ఓ సతీశ్ కుమార్, ఎస్బి, డీసీ ఆర్బీ ఇన్స్పెక్టర్ శివ కుమార్, శ్రీనివాస్, గద్వాల సీ. ఐ చంద్ర శేఖర్, అలంపూర్ సి. ఐ సూర్య నాయక్, శాంతి నగర్ సీ. ఐ శివ శంకర్, సీసీ లోహిత్ , రిజర్వ్ ఇన్స్పెక్టర్లు నగేష్, పెద్దయ్య ఎస్సైలు, డిపిఓ సిబ్బంది , ఐటీ, డీసీ ఆర్బీ, ఎస్బి సిబ్బంది, బరోసా సిబ్బంది తదితరులు ఎస్పీ కి స్వాగతం పలికారు.




