ఎస్బిఐ బ్యాంకు లో ఖాతాదారునికి కరెంట్ షాక్

 బషీరాబాద్ జూలై 27, (జనం సాక్షి) వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల కేంద్రంలో ఎస్బిఐ బ్యాంకు లో ఓ ఖాతాదారుడు నగదు డ్రా చేసుకోవడానికి వెళ్ళగా క్యాష్ కౌంటర్ దగ్గర చేతికి కరెంటు షాక్ రావడంతో భయంతో బయటికి వచ్చారు.ఎవరికి ఎలాంటి అపాయం జరగలేదని,ఎస్బిఐ బ్యాంకు లో పైకప్పు లీకేజీ ద్వారా బ్యాంకులో నీరు రావడంతో కరెంటు షాక్ వచ్చిండొచ్చని తెలిపారు.ఈ విషయం పైన బషీరాబాద్ ఎస్బిఐ బ్యాంక్ మేనేజర్ ను వివరణ కోరగా నిరాకరించారు.

తాజావార్తలు