Tuesday, 3 November 2026

ఎస్వీఆర్ లో క్యాథ్ ల్యాబ్ ను ప్రారంభించిన మంత్రి జగదీష్ రెడ్డి

 

 

 

 

 

 

సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): జిల్లా కేంద్రంలోని ఎంజీ రోడ్డులో గల ఎస్వీఆర్ కిడ్నీ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు కార్డియాలజీ వైద్య సేవలు, అత్యాధునిక వసతులతో నూతనంగా ఏర్పాటు చేసిన క్యాథ్ ల్యాబ్ (గుండెకు స్టంట్ వేసే పరికరం)ను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ ఆసుపత్రుల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించి వారి మన్ననలు పొందాలని అన్నారు.జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజ్ ఏర్పడిన తరువాత వైద్య సేవలు విస్తరించాయని, సూర్యాపేట జిల్లా మెడికల్ హబ్ గా మారిందని పేర్కొన్నారు. వైద్యాన్ని వ్యాపార దృక్పథంతో కాకుండా సేవా దృక్పథంతో అందించాలన్నారు.అత్యాధునిక వసతులతో కూడిన కార్డియాలజీ సేవలను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయం అన్నారు.ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకట నారాయణ గౌడ్ , మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిషోర్, వార్డు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మురళీధర్ రెడ్డి, డిప్యూటీ డిఎంహెచ్ఓ
డాక్టర్ హర్షవర్ధన్, ఆసుపత్రి గుండె వ్యాధుల ప్రత్యేక వైద్యులు డాక్టర్ మదన్ కుమార్, డాక్టర్ దుర్గాబాయి , డాక్టర్ సుబ్రహ్మణ్యం , డాక్టర్ దీపక్ కుమార్, డాక్టర్ అనిల్, డాక్టర్ రామ్మూర్తి యాదవ్, డాక్టర్ గంట దయాకర్ రెడ్డి, డాక్టర్ ఆదుర్తి రమేష్ , డాక్టర్ శ్రీనివాస రెడ్డి, డాక్టర్ రంగారెడ్డి, డాక్టర్ శ్రీరామ్ కుమార్, అడ్వకేట్ శశిధర్ తదితరులు పాల్గొన్నారు.