Wednesday, 4 November 2026

ఎస్సి ఏబీసీడి వర్గీకరణపై స్పష్టమైన వైఖరి తెలియజేసి పాదయాత్ర కొనసాగించాలి

 

 

 

 

 

 

 

ఎమ్మార్ పిఎస్ నియోజకవర్గ ఇంచార్జి దీకొండ మహేందర్ మాదిగ డిమాండ్ధర్మపురి (జనం సాక్షి)బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కన్వీనర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిర్వహిస్తున్న పాదయాత్రలో భాగంగా పెగడపల్లి, ధర్మారం,గొల్లపల్లి మండలాల్లో నిర్వహిస్తున్న పాదయాత్ర కేవలం మాదిగ పల్లెల్లోనే కొనసాగించడం అత్యంత బాధాకరం ఈ పాదయాత్ర మాదిగ పల్లెల్లో కొనసాగించటం వెనుక మాదిగ ఓట్లు చీల్చడానికె అని స్పష్టంగా అర్థమవుతుంది అని బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న ప్రవీణ్ కుమార్, ఈ నియోజకవర్గంలో ఎస్సి జనాభాలో అత్యంత ఎక్కువగా ఉన్న కులస్తులు మాదిగలు మరి మాదిగ ప్రజలకు,యువతీయువకులకు విద్యాపరంగా,రాజకీయాపరంగా, ఉద్యోగపరంగా కోల్పోతున్న మన హక్కుల గురించి మందకృష్ణ మాదిగ గత ఇరవై ఏనమిది ఏళ్ల నుండి పోరాడుతుంటే మీరు కూడా మాదిగ పల్లెలలోనే పాదయాత్ర కొనసాగిస్తున్నారు కాబట్టి ఎస్సి ఏబీసీడి వర్గీకరణపై స్పష్టంగా మీ వైఖరి తెలియజేసి ఈ నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సమావేశంలో మహాజన సోషలిస్టు పార్టీ నియోజకవర్గ ఇంచార్జి అరికిల్ల సతీష్,దళిత సంఘాల రాష్ట్ర కార్యదర్శి పారిపెల్లి రాజమల్లయ్య, మండల గౌరవ అధ్యక్షుడు బొల్లారపు పోచయ్య, ఎమ్మార్ పిఎస్ మండల ఇంచార్జి జిల్లపెల్లి రవి,పట్టణ ఇంచార్జి పులి ప్రేమిత్,ఎంఎస్పి గొల్లపల్లి మండల ఇంచార్జీ ముల్కల శ్రీనివాస్,ఎంఎస్పీ నాయకులు జిల్లపెల్లి గంగారాం,ఉపారపు రాజనర్సయ్య తదితరులు పాల్గొన్నారు.