– తెలంగాణ జన సమితి ముధోల్ ఇన్చార్జి సర్దార్ వినోద్.భైంసా రూరల్ ఫిబ్రవరి 08 జనం సాక్షిమహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కేంద్రంలో బి.ఆర్.ఎస్ నిర్వహించిన సభలో ఉత్తర తెలంగాణ వరప్రదాయిని గోదావరి నది జలాల మీద తెలంగాణ ముఖ్యమంత్రి కె.సి.అర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడడాన్ని తెలంగాణ జన సమితి తీవ్రంగా ఖండిస్తున్నదని ముధోల్ నియోజకవర్గ ఇంచార్జీ సర్దార్ వినోద్ కుమార్ అన్నారు. మంగళవారం బైంసా పట్టణంలోని విశ్రాంతి భవనంలో విలేకరులు సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు…ఒకవైపు కృష్ణ నది నీళ్లు ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్ పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటరీ ద్వారా తరలించుకు పోతున్న కమీషన్లకు కక్కుర్తి పడి మాట్లాడని కె.సి.అర్…నేడు ఎస్సారెస్పీ గోదావరి బ్యాక్ వాటర్ ను మహారాష్ట్ర వాళ్లు తీసుకుపోవచ్చు అనడం తన చవకబరుతననికి నిదర్శనమని ఆన్నారు.గోదావరి నది మీద నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు అక్రమమనే సోయి కె.సి.అర్ కు ఉందో లేదో చెప్పాలని,గోదావరి మీద అక్రమంగా బాబ్లీ ప్రాజెక్టును నిర్మించి గోదావరి వరద ఉధృతిని తగ్గించిన మాట్లాడని కె.సి.అర్, ఇప్పుడు గోదావరి నీళ్ళే మహారాష్ట్ర వాళ్లు తీసుకు పోవచ్చు అనడనికి గోదావరి నీళ్లు కె.సి.అర్ తన స్వంత ఆస్తి కాదన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు.ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే రైతుల బాధలు తెలిస్తే గోదావరి నది మీద నూతన ఎత్తిపోతల పథకాలను నిర్మించి,పాత వాటికి పునరుద్ధరణ పనులు చేపట్టి గోదావరి నీళ్లను వెనుకబడ్డ ముధోల్ నియోజకవర్గానికి అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టి.జె.ఎస్ నాయకులు విలాస్, గంగాధర్, సంతోష్,రాజేశ్వర్, భూమయ్య తదితరులు పాల్గొన్నారు.




