ఎమ్మెల్యే మదన్ రెడ్డిజనం సాక్షి/ కొల్చారం మండలంలో నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి పర్యటించారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని 22 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. అనంతరం గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న సిసి రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ నిరుపేదల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో గణేష్ రెడ్డి తహసిల్దార్ చంద్రశేఖర రావు జడ్పిటిసి మేఘమాల సంతోష్ ఎంపీపీ మంజుల కాశీనాథ్ కొల్చారం సర్పంచ్ ఉమాదేవి రాజా గౌడ్ తదితరులు పాల్గొన్నారు




