Saturday, 7 November 2026

ఎస్సి వర్గీకరణ బిల్లుకు ప్రస్తుత శీతాకాల పార్లమెంట్ లో సమావేశాల్లోనే చట్టబద్దత కల్పించాలే

ఎస్సి వర్గీకరణ బిల్లుకు ప్రస్తుత శీతాకాల పార్లమెంట్ లో సమావేశాల్లోనే చట్టబద్దత కల్పించాలే

ఎంఎస్పీ ఆధ్వర్యంలో తహశీల్దార్ కు మెమోరాండం అందజేత

 

ఆత్మకూర్ (ఎం) డిసెంబర్ 19 (జనంసాక్షి) ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ పిలుపు మేరకు
ప్రస్తుతం శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లోనే కేంద్ర ప్రభుత్వం ఎస్సి వర్గీకరణ బిల్లు ను పార్లమెంట్ లో ప్రవేశ పెట్టి వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని అందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం పై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ తో ఎస్సి వర్గీకరణ ను నిర్లక్ష్యం చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసిస్తూ ఎంఎస్పీ ఆధ్వర్యంలో స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసి తహశీల్దార్ మెమోరాండం అందజేయడం జరిగింది ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ ఎస్సి వర్గీకరణ జరుగకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఎన్నో ఉద్యోగ ఉపాధి అవకాశాలకు నోటిఫికేషన్లు విడుదల జరుగుతుండటం తో ఎస్సిలలోని మాదిగలు ఉప కులాలు ఉమ్మడి రిజర్వేషన్ల విధానంలో తీవ్రంగా నష్ట పోవడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ఎస్సి వర్గీకరణ బిల్లు కు పార్లమెంట్ లో చట్టబద్దత కల్పించాలని కోరడం జరిగింది 28 సంవత్సరాలు గా ఉద్యమాలు చేపడుతున్న కూడా మాదిగల ఉపకులాల ఆవేదన పై ఇంకా కూడా తాత్సారం చేస్తే మాదిగల ఉపకులాల ఆగ్రహావేశాలు తారస్థాయి కు చేరితే దానికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో
ఎంఎస్పీ జిల్లా కో ఆర్డినేటర్ నల్ల చంద్ర స్వామి మాదిగ మండల కో ఆర్డినేటర్ మందుల లింగ స్వామి మాదిగ పట్టణ నాయకులు గట్టు రాజు మాదిగ ఎంఎస్ఎఫ్ జిల్లా కో కన్వీనర్ నల్ల బాలరాజు మాదిగ పట్టణ నాయకులు కదిరే సాయి మాదిగ గట్టు అజయ్ మాదిగ నల్ల భాను మాదిగ,బద్దుల మనోజ్ మాదిగవేముల చింటు మాదిగ తదితరులు పాల్గొన్నారు