జోగులాంబ ను దర్శించుకున్నత మాత్రాన ఈడి దాడులను తప్పించుకోలేరు. *బిఎస్పి అలంపూర్ ఇంచార్జి మహేష్ *
అలంపూర్ జనంసాక్షి డిసెంబర్ 19 అక్రమ ఆస్తులు సంపాదన కేసులో ఈడీ కేసులు ఎదుర్కొంటూనా మంత్రి మల్లా రెడ్డి జోగులాంబ ను దర్శించుకున్నత మాత్రాన ఈడీ నుండి తప్పించుకోలేరు అని బియస్ పి అలంపూర్ ఇంచార్జి మహేష్ అన్నారు.సోమవారం దక్షిణ కాశి ఐదవ శక్తిపీఠమైన జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి అమ్మవార్లను కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి,ఎమ్మెల్యే అబ్రహంతో కలిసి దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా బీఎస్పీ నాయకులు అలంపూర్ నియోజకవర్గ అధ్యక్షులువిలేకరుల సమావేశం లో మహేష్ మాట్లాడుతూ మంత్రి మల్లారెడ్డి అక్రమ ఆస్తులపై జరుగుతున్న ఈడీ దాడులను తప్పించుకోవాలని అమ్మవారిని ఆశ్రయించావాఅన్నారు.అలంపూర్ ను ఏమీ అభివృద్ధి చేశారని వస్తున్నారు అన్నారు.
జోగులాంబ అలంపూర్ కేవలం దర్శించుకోవడానికేనా ఇక్కడ ప్రజల బాగోగులను ఏమైనా పట్టించుకోవడానికి వస్తారా? దర్శనానికి వస్తున్న భక్తులకు వసతులు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్న మీకు కానరావడం లేదా అన్నారు.
టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక విచ్చలవిడిగా సంపాదించిన ధనంతో బి.ఆర్.ఎస్ అని పార్టీ పెట్టారు. అక్రమాస్తులపై జరుగుతున్న ఈడీ కేసులను తప్పించుకోవడానికి రకరకాల డ్రామాలు ఆడుతూ తిరుగుతున్నారని బిఎస్పీ నాయకులు ఎద్దేవా చేశారు.ఈ సమావేశం లో బాబు, రాజ్ తదితరులు పాల్గొన్నారు.




