ఎస్సీ , ఎస్టీ , బీసీ , మైనారిటీ సంఘల ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వెడుకలు
రఘునాథ పాలెం నవంబర్ 26 జనం సాక్షి
ప్రపంచ దేశాలలో రెండవ అతిపెద్ద ప్రజాస్వామిక భారతదేశన్ని ఒకే తాటిపై నడిపించే మన రాజ్యాంగాన్ని రూపొందించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరియు సదరు రాజ్యాంగం ఆమోదించబడి 72 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా మన ఖమ్మం నగరంలో అంబేద్కర్ సెంటర్ నందు రాజ్యాంగ దినోత్సవం మన సామాజిక నాయకులు ఫిరంగి రామదాసు మరియు కాకాని రామారావు నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో పలువురు అంబేద్కర్ యిజాన్ని దిక్కులు మార్మోగేలా నినదించారు . ఆపై బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్ర పఠానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు . ఈ కార్యక్రమంలో ఎస్సీ , ఎస్టీ , బీసీ , మైనారిటీ సంఘ నాయకులు పాల్గొన్నరు
ఎస్సీ , ఎస్టీ , బీసీ , మైనారిటీ సంఘల ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వెడుకలు




