Saturday, 7 November 2026

రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తున్న బిజెపి విధానాలకు వ్యతిరేకంగా పోరాడండి

రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తున్న బిజెపి విధానాలకు వ్యతిరేకంగా పోరాడండి

మోత్కూర్ నవంబర్ 26 జనంసాక్షి : భూమి ఉంటేనే పేదల కుటుంబాలు అన్ని విధాలుగా ముందుకు సాగుతాయని భూ పంపిణీ ద్వారానే ఆర్థిక సమానత్వం వస్తుందని రాష్ట్రవ్యాప్తంగా భూమిలేని పేదలందరికీ ప్రభుత్వ మిగులు భూములను పంపిణీ చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. వెంకట్రాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా ద్వితీయ మహాసభలు స్థానిక సుమంగళి ఫంక్షన్ హాల్ లో జిల్లా ఉపాధ్యక్షులు బొల్లు యాదగిరి అధ్యక్షతన నిర్వహించారు ఇట్టి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధులుగా పాల్గొని మాట్లాడుతూ పాలకులు దేవాలయాలకు, ప్రాజెక్టులకు, రోడ్లకు, పారిశ్రామిక వేతలకు వేలాది ఎకరాల భూములు సేకరిస్తు కారు చౌకగా కట్టబెడుతున్నారు కానీ పేదోడు తల దాచుకోవడానికి, ఉండడానికి ఇంటి స్థలము, సాగు చేసుకుని జీవించడానికి సెంటు భూమి ఇవ్వడానికి మాత్రం చేతులు రావడంలేదని ఆవేదన వెలిబుచ్చారు. రాష్ట్రంలో లక్షలాదిమంది నిరుపేదలు ఇళ్లు ఇండ్ల స్థలాల కోసం గత ఏడ ఎనిమిది సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నారని ప్రభుత్వ మాత్రము పట్టించుకోవడంలేదని ఇచ్చిన హామీని కూడా అమలు చేయడం లేదని అన్నారు రాష్ట్రంలో ఇప్పటికే వందలాది గ్రామాల్లో ప్రభుత్వ భూములలో గుడిసెలు వేసుకుని పేదవాళ్లు నివసిస్తున్నారని రానున్న కాలంలో రాష్ట్రవ్యాప్తంగా భూ పోరాటాన్ని ఇళ్ల స్థలాల పోరాటాన్ని ఉధృతంగా నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బ తీసుకున్నదని ప్రజల హక్కులను కాలరాస్తుందని విమర్శించినారు. వ్యవసాయ కూలీలకు పేదలకు కనీస వేతనాల చట్టాన్ని అమలు చేయడం లేదని ఉన్నత వర్గాలకు పెట్టుబడిదారులకు మాత్రం వాళ్ళ ఆస్తులను పెంచుకోవడానికి వారికి అనుకూలమైన చట్టాలు మాత్రం అమలు చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనీస వేతనాల చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేసినారు. జాతీయ గ్రామీణ ఉపాధి చట్టం వచ్చిన తర్వాత వ్యవసాయ కూలీల బతుకులలో కొంత మార్పు వచ్చిందని మున్సిపల్ పట్టణాలు ఏర్పడిన తర్వాత ఉపాధి పనులు కూడా పోయి పేదల బతుకులు వ్యవసాయ కూలీల బతుకును చిందర బందరుగా మారాయని ఇప్పటికైనా అన్ని మున్సిపల్ పట్టణాల్లో జాతీయ గ్రామీణ ఉపాధి చట్టాన్ని అమలు చేయాలని, సంవత్సరానికి 200 రోజుల పని దినాలు కల్పించాలని, రోజు వేతనము 600 రూపాయలు ఇవ్వాలని,పని ప్రదేశాల్లో మౌలిక సమస్యలు పరిష్కారం చేయాలని, నూతన పనిముట్లు ఇవ్వాలని, జాతీయ గ్రామీణ ఉపాధి చట్టానికి కేంద్ర ప్రభుత్వము ప్రతి బడ్జెట్లో అధిక నిధులు కేటాయించాలని డిమాండ్ చేసినారు రానున్న కాలంలో భూమికోసం, కూలీ రేట్ల పెంపు కోసం , జాతీయ గ్రామీణ ఉపాధిహామీ చట్ట పరిరక్షణ కోసం వ్యవసాయ కూలీలు, పేదలు పోరాటాలకు సిద్ధం కావాలని వెంకట్రాములు పిలుపునిచ్చారు. రెండు రోజులపాటు నిర్వహిస్తున్న ఈ జిల్లా మహాసభలో యాదాద్రి జిల్లాలో ఉన్న భూమి కూలీ ఉపాధి సంక్షేమము సామాజిక సమస్యలపై చర్చించి పోరాట కర్తవ్యాలను రూపొందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యురాలు రాచకొండ రాములమ్మ, చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గుండు వెంకట నర్సు, జిల్లా ఉపాధ్యక్షులు కూరపాటి రాములు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు వల్లంబట్ల శ్రీనివాసరావు, మండల కార్యదర్శి మెతుకు అంజయ్య, మండల పట్టణ నాయకులు కందుకూరి నరసింహ, సామకూరి శోభ, గుండు లక్ష్మి, కూరపాటి జయమ్మ,ఎం. పద్మ,ఎస్.అలివేల,కే.అంజమ్మ, రాచకొండ కనకయ్య,యాదయ్య,మెతుకు సాయిలు,కొంపెల్లి ముత్తమ్మ,గంగయ్య తదితరులు పాల్గొన్నారు.