ఘనంగా రెడ్ డే ఉత్సవాలు.

ఫోటో రైట్ ఆఫ్01తుర్కపల్లి ఉత్సవాలు నిర్వహిస్తున్న దృశ్యం.
తుర్కపల్లి మండల కేంద్రంలో గల పడాల ముత్యాలు మెమోరియల్ హైస్కూల్ లో శనివారం సాంస్కృతిక  దైనందిన కార్యక్రమంలో బాగంగా రెడ్ డే ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థిని విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. విద్యార్థులు ఆట ,పాటలతో అలరించారు..ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ పడాల శ్రీనివాస్ రెడ్ డే గురించి వివరించారు. అనంతరం విద్యార్థులకు బహుమతులు అందచేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జంగిటి శ్రీనివాస్, ,ప్రధానోపాధ్యాయుడు నర్సింహారెడ్డి, ఉపాద్యాల బృందం ,విద్యార్థుల తల్లిదండ్రులు ,విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.