Wednesday, 4 November 2026

ఎస్సెస్సి లో మెరిసిన బెల్లంపల్లి సిఓఈ విద్యార్ధులు. – 100శాతం ఫలితాలు, పరీక్షకు హాజరైన 72మంది ఉత్తీర్ణత. – 10జిపిఏ సాధించిన కొండగొర్ల సిద్దార్ధ.

 

 

 

 

బెల్లంపల్లి, మే 10(జనంసాక్షి )10వ తరగతి ఫలితాల్లో తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్సీ (సిఓఈ)బెల్లంపల్లి విద్యార్ధుల హవా కొనసాగింది. బుదవారం ఎస్సెస్సీ బోర్డ్ ప్రకటించిన ఫలితాల్లో బెల్లంపల్లి బాలుర గురుకులం నుండి 72మంది పరీక్షకు హాజరుకాగా 72మందీ ఉత్తీర్ణులై 100శాతం ఫలితాలతో ముందజలో ఉన్నారు. వీరిలో కొండగొర్ల సిద్దార్ధ 10జిపిఏ సాధించగా నీలాల అభిరాం,గోమాస యశ్వంత్ లు9.8 జిపిఏ సాధించారు. ఐదుగురు విద్యార్ధులు 9.7 జిపిఏ సాధించడమేకాక 29మంది విద్యార్ధులు 9జిపిఏ ఆపైన సాధించడం విశేషం. గతనాలుగు సంవత్సరాలుగా వరసగా 100శాతం ఫలితాలతో ఫలితాలు ఏవైన తమకు తిరుగులేదని నిరూపించారు. తమ విద్యార్ధులు ఉత్తమ ఫలితాలు సాధించడం పట్ల ప్రిన్సిపాల్ ఐనాల సైదులు సంతోషం వ్యక్తం చేశారు. అద్బుతమైన విజయాలతో గురుకులాల్లోనే ఆదర్శవంతంగా నిలవడం పట్ల ఆదిలాబాద్ సక్షేమ గురుకులాల ఆర్సీఓ కొప్పుల స్వరూపరాణి అభినందనీయం అన్నారు. ఈ సందర్భంగా 10జిపిఏ సాధించిన కొండగొర్ల సిద్దార్ధ ను ప్రిన్సిపాల్ ప్రత్యేకంగా అభినందించారు. ఉపాధ్యాయులు ప్రిన్సిపాల్ తో కలిసి మిఠాయిలు పంచుకున్నారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ కోట రాజ్ కుమార్, సీనియర్ ఉపాధ్యాయులు వరమని ప్రమోద్ కుమార్, ఆకెనేపల్లి రాజేష్, గాజుల రాజేందర్, కామెర ప్రేమలత, తేజశ్వి, సమేందర్, ఐ.మల్లేష్, రమేష్, అనిరుద్ తదితరులు పాల్గొన్నారు.