. జనం సాక్షి దుబ్బాకదుబ్బాక టౌన్: దుబ్బాక పురపాలక సంఘం చెల్లాపూర్ మూడవ వార్డులో కౌన్సిలర్ మట్ట మల్లారెడ్డి తడి చెత్త పొడి చెత్త పై అవగాహన కల్పిస్తూ రానున్న వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని ఈగులు దోమలు క్రిమి కీటకాలు రాకుండ నివారించడానికి తడి చెత్తను, పొడి చెత్తను విడివిడిగా వేరుచేసి మున్సిపల్ నుండి వచ్చే చెత్త వాహనదారునికి అందజేసి పరిసరాలను శుభ్రంగా ఉంచుకొని ఈగలు, దోమలు రాకుండా చెత్తాచెదారం లేకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచుకొని వర్షాకాలంలో ఏలాంటి రోగాలు రాకుండా ప్రజలంతా సహకరించాలని దుబ్బాక మున్సిపల్ లోని మన వార్డును స్వచ్ఛ వార్డుగా చేసి మన వార్డు స్వచ్ఛ వార్డు- స్వచ్ఛ దుబ్బాక గా ముందంజలో ఉండాలని ఉండాలని దీనికి ప్రజలంతా సహకరించాలని కోరారు.
తడి పొడి చెత్త పై అవగాహన కల్పిస్తున్న కౌన్సిలర్ మట్ట మల్లారెడ్డి




