జనంసాక్షి, కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండల పోలీస్ స్టేషన్ కు నూతనంగా బదిలీపై వచ్చిన సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బేతి రాములు ను గురువారం కమాన్ పూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైనాల రాజు ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రంగు సత్యనారాయణ గౌడ్, నాయకులు కుక్క రవి, ఇక్బాల్, లింగాల కుమార్, శేఖర్, లల్లు,మామిడి రాజు తదితరులు ఉన్నారు.
ఎస్సై ని కలిసిన కాంగ్రెస్ నాయకులు




