మరణిండి ఎస్ ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నేత్రదానం ప్రారంభం డి ఎస్ ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నేత్రదానం ప్రారంభం చాక కూడా తన కళ్ళు లోకాన్ని చూడగల అద్భుతం నేత్రదానం హుజూర్ నగర్ డిసెంబర్ 25 (జనంసాక్షి): దగ్గుపాటి సుశీల రాజారత్నం డి ఎస్ ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏసుప్రభు పుట్టినరోజు సందర్భంగా ఆదివారం హుజూర్ నగర్ లో నేత్రదానం కార్యక్రమం ప్రారంభించామని డిఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ దగ్గుపాటి బాబురావు తెలిపారు. హుజూర్ నగర్ పట్టణంలోని తిలక్ నగర్ చెందిన మామిడి కిషోర్ ఎస్సై టాస్క్ ఫోర్స్ (SOT) హైదరాబాద్, డి ఎస్ ఆర్ ట్రస్ట్ గౌరవ అధ్యక్షులు దగ్గుపాటి సత్యానందం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నేత్రదానం శ్రేష్ట దానం ఇద్దరు అంధులకు చూపుదానం కార్యక్రమాలు హుజూర్ నగర్ నియోజకవర్గం పరిధిలో ఎవరైనా మరణించిన 7 నుంచి 8 గంటల లోపు కుటుంబ సభ్యులు మానవత్వంతో నేత్రదానం చేపించాలి అని అనుకుంటే డి ఎస్ ఆర్. ట్రస్ట్ చైర్మన్ దగ్గుపాటి బాబురావు ఫోన్ నెంబర్.8309259384, 9010439879 లను సంప్రదించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీరు ఫోన్ చేసిన 2 గంటల లోపల ఖమ్మం నేత్ర నిధి బృందం రావడం జరుగుతుంది, కొద్ది క్షణాలపాటు ఈ లోకమంతా చీకటి కమ్మేస్తే… ప్రాణం పోయినట్లు బాధపడతాం… అంత చీకటిని భరించలేక అల్లాడిపోతాం. కళ్లు నలుపుకుంటూ ఆ చీకటిని దాటి చూసే ప్రయత్నం చేస్తాం.. అటువంటిది పుట్టుకతో లేదా ప్రమాదవశాత్తు కళ్లు పొగొట్టుకున్న వాళ్లకు జీవితాంతం అన్ని క్షణాలు చీకటే.. ఎంతగా ఎదిగినా ప్రపంచాన్ని చూడలేమన్న బాధే…! అటువంటి వారికి చూపునిచ్చే అవకాశం మనకే వస్తే… మనం చనిపోయిన తరువాత కూడా మన కళ్లకు మరో జీవితం లభిస్తే.. అంతకన్నా ఆనందం మరొకటి వుండదు. మరి నేత్రదానం చేస్తే ప్రతిఒక్కరూ ఈ ఆనందాన్ని పొందవచ్చు. నేత్రదానం గొప్పదానం మనిషి మరణించాక కూడా తన కళ్ళు లోకాన్ని చూడగల అద్భుతం నేత్రదానం ద్వారనే జరుగుతుందన్నారు. సమాజంలో అందరిని చైతన్య పరిచి నేత్రదానం చేసేందుకు ఒప్పించాలని, ఒకరు నేత్రాలను దానం చేస్తే వారు ఇద్దరికి కంటిచూపు ఇచ్చిన వారవుతారని,
కళ్లు లేని వారు లక్షల్లో ఉన్నారు మనం చనిపోయిన తర్వాత మట్టిలో కలపకుండా వేరే వాళ్లకి నేత్ర దానం చేయవలసినదిగా ప్రతి ఒక్కరు మరణం అనంతరం కళ్ళు దానం చేసి కంటి చూపు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు దగ్గుపాటి సుశీల, కామల్ల మార్క్స్, లచ్చిమల్ల నాగేశ్వరరావు, కోలపూడి కళ్యాణ్, మామిడి అశోక్, చింతమల్ల ప్రసాద్, మామిడి రాజేష్, దగ్గుపాటి సురేష్, దగ్గుపాటి రాజేష్, దగ్గుపాటి కవిత, కొల్లపూడి ప్రేమ్ చందు, మామిడి నవీన్, మామిడి రాజేష్, మామిడి ప్రశాంత్, పిఎన్ఆర్, పాశం నరసింహారావు, పొదిల తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
ఎస్ ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నేత్రదానం ప్రారంభం




