వేతన ఒప్పందం కోరకు సమ్మె చేయడానికి సిద్ధం……
సింగరేణి కి పూర్వ వైభవం తేవడం తోనే సాధ్యం…
సింగరేణిలో రాజకీయ జోక్యం…..
–బీఎంఎస్ జాతీయ బొగ్గు గనుల ఇంచార్జీ కొత్తకాపు లక్ష్మరెడ్డి…….
బొగ్గు గని కార్మికుల11వ వేతన ఒప్పంద సాధన కొరకు సమ్మె చేయడానికి బిఎమెస్స్ యూనియన్ సిద్ధంగా ఉన్నామని బిఎంఎస్ జాతీయ బొగ్గు గనుల ఇంచార్జీ, జేబీసీసీఐ సభ్యులు కొత్తకాపు లక్ష్మారెడ్డి తెలిపారు. భూపాలపల్లి ఏరియాలోని సుభాష్‌కాలనీ సింగరేణి కమ్యూనిటీ హాల్లో ఆదివారం బిఎంఎస్ ఆధ్వర్యంలో రాజకీయ శిక్షణ తరగతులను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లక్ష్మారెడ్డి హాజరై మాట్లాడారు..
ఇటీవల సింగరేణి యాజమాన్యం విడుదల చేసిన ఒక ప్రకటనలో గతంలో సాధించిన ఉత్పత్తి లక్ష్యాలను అధిగమించామని చెప్పడం బాగుందన్నారు. అదే తరుణంలో ప్రభుత్వం నుంచి సింగరేణికి రావాల్సిన 24 వేల కోట్ల బకాయిలను గురించి ఎందుకు మాట్లాడటం లేదు అని ప్రశ్నించారు వెంటనే యాజమాన్యం సింగరేణికి రావాల్సిన మొండి బకాయిలను ప్రకటించలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలను వసూలు చేయడంలో సింగరేణి యాజమాన్యం పూర్తిగా విఫలమైందన్నారు.
జేబీసీసీఐ సమావేశంలో 11వ వేతన ఒప్పందంలో 28/- శాతానికి తగ్గకుండా పెంచాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం, మరియు కోల్ఇండియా యాజమాన్యం కేవలం 10 శాతం మాత్రమే వేతన ఒప్పందం పెంచేందుకు సుముఖంగా ఉందన్నారు. గత నెలలో జరిగిన సమావేశాన్ని BMS బహిష్కరించి బయటకు వచ్చినట్లు తెలిపారు. డిసెంబర్ 9వ తేదీ నాడు దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు నిర్వహించిన ఆందోళన కార్యక్రమం ద్వారా కోల్ ఇండియా మరియు సింగరేణి యాజమాన్యంపై ఒత్తిడి పెరిగిందని తెలియజేశారు కోల్ మినిస్టర్ శ్రీ ప్రహ్లాద్ జోషి గారు త్వరతగతిన వేతన సవరణ ఒప్పందం జరిగే విధంగా చూస్తానని తెలియజేయడాన్ని స్వాగతించారు జనవరి 7వ తేదీన రాంచీలో నాలుగు జాతీయ కార్మిక సంఘాలు ఆధ్వర్యంలో సమ్మేళనం నిర్వహించబోతున్నారు అట్టి కార్యక్రమంలో తదుపరి ఆందోళన కార్యక్రమాలు నిర్ణయం జరుగుతుంది అంతే కాదు అవసరమైతే నిర్వహిక సమ్మె చేసి దేశంలోని బొగ్గు గని కార్మికులకు మెరుగైన వేతన ఒప్పందం కోసం యూనియన్ కృషి చేస్తుంది. 2003 జనవరి 7వ తేదీన అన్ని జాతీయ కార్మిక సంఘాలతో రాంచీలో సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తామన్నారు.అదేవిధంగా దేశవ్యాప్తంగా అన్ని రకాల పరిశ్రమలలో ప్రమాదాల నివారణ చర్యలు జరుగుతున్నాయని ప్రమాద రహిత పనులు జరుగుతున్నట్లు తెలిపారు. సింగరేణి యాజమాన్యం మాత్రం రక్షణ గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు.
ఈ సంవత్సరం ఇప్పటివరకు ఐదుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. కార్మికుల ప్రాఫిడెంట్ ఫండ్ కార్యాలయాన్ని పూర్తిగా అన్లైన్∙చేయాలని డిమాండ్ చేశారు. ధన్బాద్లో ఉన్నటువంటి కార్యాలయంలో అనేక అక్రమాలు జరుగుతున్నాయని, సిఎంపిఎఫ్ కార్యాలయ పనితీరులను మెరుగుపరచవలసిన అవసరం ఉందన్నారు.దీనిపై బిఎమ్మె స్ ఇప్పటికే కేంద్ర కోల్ శాఖ మంత్రి, కార్యదర్శులు దృష్టికి తీసుకుపోవడం జరిగిందని, రూ.720 కోట్ల కుంభకోణంపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశాము.
సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు సింగ సింగరేణి యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం హైపవర్ వేతనాలు అమలు చేయడం లేదని, నామమాత్రపు వేతనాలు ఇస్తూ కార్మికులను శ్రమదోపిడి గురి చేస్తున్నారన్నారు. రెగ్యులర్ కార్మికులతో సమానంగా సెలవులు, బోనసులు, మెరుగైన వైద్య సేవలు అమలు చేయాలని బిఎమ్మెస్ డిమాండ్ చేసింది సింగరేణిలో విపరీతంగా రాజకీయ జోక్యం శ్రుతిమించిపోయిందని ఆరోపించారు. ఎమ్మెల్యేలు.ఎంపి లు ఎవరికి వారే అందిన కాడికి సింగరేణి నిధులను మళ్లించుకొని దోచుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, టిడిపి ప్రభుత్వ హయాంలో ఎప్పుడు కూడా ఇంత రాజకీయ జ్యోకం జరగలేదన్నారు.
సింగరేణిలో రాష్ట్ర ప్రభుత్వ అనుసన్నల్లో ప్రవేటికరణ జరుగుతోందని అలాగే అంతర్గత ప్రవేటికరణ ప్రోత్సహిస్తూ సింగరేణిలో ఉద్యోగాలకు బౌద్యత్ లో అవకాశాలు లేకుండా చేస్తూ సంస్థ నిర్వీర్యనికి కుట్రలు చెడుతున్న రాష్ట్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేకవైఖరికి వ్యతిరేకంగా కార్మికులు బిఎమ్మెస్ నిర్వహించే పోరాటంలో భాగస్వామ్యం కావాలని పిలుపుణిస్తున్నాం.
ఈ సమావేశంలో జాతీయ, రాష్ట్ర నాయకులు మాదవ్ నాయక్, జేబీసీసీ సభ్యులు,యాదగిరి సత్తయ్య యూనియన్ అధ్యక్షులు.ఏ బి కె ఎం ఎస్ జాతీయ కార్యవర్గ సభ్యులు రామకాంత్, పవన్‌కుమార్ . ప్రధాన కార్యదర్శి.పేరం రమేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ స్థానిక బ్రాంచి ఉపాధ్యక్షులు అప్పాని శ్రీనివాస్, సుజేందర్ బ్రాంచి కార్యదర్శి.రెనుకుంట్ల మల్లేష్ బ్రాంచి నాయకులు పండ్రాల మల్లేష్ ట్రెజరర్ బోయిన వెంకటస్వామి, బత్తుల స్వామి, జనార్ధన్, ఓరం లక్ష్మణ్ కొత్తూరి మల్లేష్ కటకం శ్రీనివాస్ డి నారాయణ.R సాగర్.అన్నం శ్రీనివాస్.అని గనులలో పని చేస్తున్న కార్యకర్తలు నాయకులు ఒక్క ఎస్సిఎంకెఎస్ శిక్షణ తరగతుల కార్యక్రమంలో పాల్గోన్నారు……….జనం సాక్




