మిర్యాలగూడ,జనం సాక్షి.హజ్-2023 మిర్యాలగూడ యాత్రికులకు స్థానిక హజ్ సొసైటి ఆధ్వర్యంలో మస్జిద్ అర్ఫాత్ లో వీడ్కోలు పలుకుతూ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మౌలానా మహమ్మద్ వలీయుల్లా, ముఫ్తీ మహమ్మద్ ఇమ్రాన్ లు మాట్లాడుతూ హజ్ సందర్భంగా ఒడుదుడుకులు, ఇబ్బందులు ఉంటాయని సహనం, ఓపికతో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలని వారు కోరారు. హజ్ విజయవంతం కావాలని, ప్రపంచ శాంతిని కోరుతూ దుఆ చేశారు. కార్యక్రమంలో సొసైటి కార్యదర్శి అర్షద్ ఖాన్, బాధ్యులు ఎండి.ఇస్మాయిల్, ఎండి.వాజిద్, యాత్రికులు ఎంఎం.బేగ్, ఎండి.అన్వర్, ఎంఎం.బారి, ఎండి.ఖదీరుద్దీన్, ఎండి.ఫహిముద్దీన్, ఎంఎం.మతీన్, మస్జిద్ కమిటి అధ్యక్షుడు ఎండి.హఫీజుద్దీన్, నాత్ ఖ్వాన్ లు అబ్దుల్ అజీజ్, సమీఖాద్రీ, హంజాఖాద్రీ, సీనియర్ జర్నలిస్టు లు ఖాజాహమీదుద్దీన్, ఎండి.అస్లం పాల్గొన్నారు.
హజ్-2023 యాత్రికులకు వీడ్కోలు, సత్కారం




