Tuesday, 3 November 2026

ఏం సాధించారని దశాబ్ది వేడుకలు

ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చాలి!!
జనం సాక్షి దుబ్బాకతెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా విద్యార్థి,ప్రజా సంఘాల నాయకులు రంగదాంపల్లి వద్ద ఉన్న అమర వీరుల స్తూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా డిటీఎఫ్ రాష్ట్ర కౌన్సిల్సభ్యులుసత్తయ్య,పీ.డీ.ఎస్.యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.వి.శ్రీకాంత్,ప్రజా సంఘాల ఉమ్మడి వేదిక రాష్ట్ర కన్వీనర్ సంతోష్ మాట్లాడుతూ తెలంగాణ సబ్బండ వర్గాల సమస్యలను పరిష్కరించకుండ కేసీఆర్ ప్రజలకు తీవ్ర అన్యాయం చేశాడని అన్నారు.ఉద్యమ ఆకాంక్షలు ,అమర వీరుల కలలను రాష్ట్ర ప్రభుత్వం మరిచిపోయి అరాచక పాలన కొనసాగిస్తుందని ఆరోపించారు.యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.ఆంధ్ర పెట్టుబడి దారులకు రెడ్ కార్పెట్ వేస్తున్నారని మండిపడ్డారు.ప్రజాస్వామిక తెలంగాణ కోసం ప్రజలంతా సమాయత్తం కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు నేత యాదగిరి, పివైఎల్ జిల్లా అధ్యక్షడు అనిల్,పీ.డీ.ఎస్.యు జిల్లా కార్యదర్శి విద్యనాథ్,పట్టణ కార్యదర్శి హిమవంత్,ప్రజా సంఘాల నాయకులు మహేందర్,మహేష్,లక్ష్మన్ తదితరులు పాల్గొన్నారు.