4,826 కి.మి రహదారుల నిర్మించాం
– ఏపీ మంత్రి లోకేశ్ కుమార్
అమరావతి, నవంబర్15(జనంసాక్షి) : ఏఐఐబీ నిధులతో 4,826 కిలోవిూటర్ల నూతన రహదారుల నిర్మాణం చేపడుతున్నామని మంత్రి నారా లోకేశ్ అన్నారు. అమరావతిలో పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ శాఖ అధికారులతో నిర్వహించిన గురువారం సవిూక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి లోకేశ్ మాట్లాడారు. 50ప్యాకేజీలుగా వివిధ దశల్లో పనులు చేపతామన్నారు. 15ప్యాకేజీలకు సంబంధించి త్వరలో పనులు ప్రారంభిస్తామన్నారు. డిసెంబర్ మొదటి వారంలోపు మిగిలిన ప్యాకేజీలు కూడా త్వరితగతిన పనులు చేపడుతామన్నారు. శ్రీకాకుళం, పశ్చిమగోదావరి జిల్లాల్లో రహదారుల మరమ్మతుల కోసం రూ.365 కోట్ల నిధులు వెచ్చిస్తున్నామన్నారు. 13 జిల్లాల్లో 22,283 కిలోవిూటర్ల గ్రావిూణ రహదారుల మరమ్మతులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. రోడ్డు మార్గం లేని నివాస ప్రాంతాలకు యుద్ధప్రాతిపదికన రహదారులు నిర్మిస్తామన్నారు. నాలుగు గ్రామాల్లో భూగర్భ నీటిపారుదల వ్యవస్థ పనులు పూర్తయ్యాయన్నారు. మిగిలిన గ్రామాల్లో పనులు డిసెంబర్ నెలాఖరుకు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
ఏఐఐబీ నిధులతో..




