Thursday, 5 November 2026

ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి

ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి పల్లా దేవేందర్ రెడ్డీ పిలుపు కొండమల్లేపల్లి నవంబర్ 22 జనం సాక్షి న్యూస్ :
ఈ నెల 27, 28, 29 తేదీల్లో యాదగిరిగుట్ట లో జరిగే ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర మూడో మహాసభలు జయప్రదం చేయాలని ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం హాలియా హనుమాన్ భవన నిర్మాణ కార్మిక సంఘం కార్యాలయంలో ఏఐటియుసి రాష్ట్ర మహాసభల పోస్టరు ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్పొరేట్ విధానాలపై, కార్మిక వ్యతిరేక విధానాలపై కార్మిక వర్గం తిరుగుబాటు చేయాలి అన్నారు. కేంద్ర ప్రభుత్వం లాభదాయకంగా నడుస్తున్న అనేక ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతూ ఉంటే ,భవిష్యత్తు తరాలకు ఏమీ మిగలదు అని అన్నారు. ప్రభుత్వ రంగం, బలపడితేనే పేద, బడుగు, బలహీన వర్గాల, కార్మికులకు, కర్షకులకు , మధ్యతరగతి వారికి, న్యాయం జరుగుతుంది అన్నారు. కనుక ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించే కేంద్ర ప్రభుత్వ విధానాలపై, కార్మిక వర్గం యావత్తు ప్రజానీకం సమరశీల ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అనేక పోరాటాలు చేసి జీవోలు, సాధించినప్పటికీ ఆ జీవోల మూలాన కార్మిక వర్గాలకు రావలసిన కనీస వేతనాలు ఇప్పటికీ అందలేదు అన్నారు. భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు నుండి రావలసిన పరిహారాలు పెంచుకునే వరకు, ఇంకా అనేక రంగాల కార్మికుల సమస్యలపై చైతన్యం చేసే దశలో ఈనెల 27, 28, 29, తేదీలలో యాదగిరిగుట్టలో జరుగుతున్న ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలలో 27 వ తేదీన జరిగే కార్మికుల ప్రదర్శన, భహిరంగ సభలో అన్ని రంగాల కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని దేవేందర్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో భవనిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు కుమ్మరి కుంట శిఖామణి ,సెంట్రింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు ఎలిగి రామలింగయ్య భవనిర్మాణ కార్మిక సంఘం గౌరవ అధ్యక్షులు గుంజ అంకారావు నాయకులు ఏం సత్యం, చిందే మాలాద్రి, కందుల సైదులు, నీలం వెంకటేశ్వర్లు, బోయ వెంకటరెడ్డి,కొమ్ము కొండలు, పరిపూర్ణాచారి, బాలు, పాల్గొన్నారు