Tuesday, 3 November 2026

ఏకపక్ష నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి

 

 

 

 

మెట్పల్లి టౌన్, ఎప్రిల్ 27, జనంసాక్షి:కోరుట్ల నియోజకవర్గకాంగ్రెస్పార్టీని బలహీన పరిచే విదంగా వ్యవహారిస్తున్న పార్టీ జిల్లా నాయకత్వం పై ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే మరియు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కి ట్విట్టర్ ద్వారా మరియు లేఖ ద్వారా పిర్యాదు చేసినట్టు మెట్టుపల్లి కాంగ్రెస్ నాయకులు తెలిపారు. కోరుట్ల నియోజకవర్గ సోషల్ మీడియా ఇంచార్జి లు నసీర్, ఎడ్ల నవీన్ లు ఎమ్మెల్యే శ్రీధర్ బాబు పై వచ్చిన వార్త పత్రిక కథనాన్ని పోస్ట్ చేశారన్న కారణంగా ఎలాంటి వివరణ అడగకుండా నియోజకవర్గ ఇంచార్జి కి సమాచారం లేకుండా సస్పెండ్ చేయడం సరైనది కాదని వెంటనే సస్పెన్షన్ ని ఎత్తివేయాలని కోరారు.పిర్యాదు చేసిన వారిలో కాంగ్రెస్ పార్టీ మాజీ పట్టణ అధ్యక్షులు డా:బెజ్జరపు శ్రీనివాస్, పట్టణ ప్రధాన కార్యదర్శి రాంప్రసాద్, సేవా దళ్ జిల్లా అధ్యక్షులు అందె మారుతీ బాపూజీ, మండలం కాంగ్రెస్ అధ్యక్షులు ఇల్లేందుల రాజు లు వున్నారు.