Tuesday, 3 November 2026

పిల్లలు సమ్మర్ కోచింగ్ క్యాంప్ సద్విని చేసుకోవాలి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ 

 

 

 

 

 

కంటోన్మెంట్ జనం సాక్షి ఏప్రిల్27  వెస్ట్ మారేడ్ పల్లి ప్లే గ్రౌండ్ లో  క్యాచ్ ఎం యంగ్ పేరున నిర్వహిస్తున్న జిహెచ్ఎంసి సమ్మర్ కోచింగ్ క్యాంప్ ను రాష్ట్రపశుసంవర్ధక శాఖ,మత్స్య సినిమాటోగ్రఫీ ,డైరీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై డిక్లరేషన్ ద్వారా ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి,మొoడా డివిజన్ కార్పొరేటర్ కొంతందీపిక నరేష్, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ,డిప్యూటీ కమిషనర్ ముకుంద్ రెడ్డి,డ్యూటీ స్పోర్ట్స్ డైరెక్టర్ కె.వేణుగోపాల్,రాజు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమం లో మంత్రి శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ  మాట్లాడుతూ జిహెచ్ఎంసి ప్రతి సంవత్సరం వేసవి కాలంలో సమ్మర్ కోచింగ్ క్యాంపులను నిర్వహిస్తున్నందున ఆరు నుండి 16 సంవత్సరాల పిల్లలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. సికింద్రాబాద్ జోన్లో ఐదు సర్కిలలో 57 గేమ్ లను 120 సెంటర్లలో, కోచ్  పర్యవేక్షణలో శిక్షణ  అందిస్తున్నమ న్నారు.స్పోర్ట్స్ మరియు గేమ్స్ పాల్గొనేవారు కనీస ఫీజు రూపాయలు 50/-షటిల్ బ్యాడ్మింటన్ ,స్కేటింగ్,క్రికెట్ ,టెన్నిస్,రోలర్ స్కేటింగ్ ఇతర గేమ్స్ కు పది రూపాయలు మాత్రమే చెల్లించి రిజిస్టర్ చేసుకోవాలన్నారు.వీటితోపాటు స్పోర్ట్స్ క్విజ్, ఇంటర్ టోర్నమెంట్స్ నిర్వహిస్తామన్నారు.డిప్యూటీ మేయర్  మోతే శ్రీలత శోభన్ రెడ్డి మాట్లాడుతూ ఏప్రిల్ 25 నుండి మార్చి 31 వరకు సమ్మర్ కోచింగ్ క్యాంపు నిర్వహిస్తున్నామని తెలిపారు.నిపుణులైన  పర్యవేక్షణలో తమ టాలెంట్ ని ఇంప్రూవ్ చేసుకోవాలని విద్యార్థులను కోరారు. విద్యార్థులకు ఆటల ద్వారా శారీరక శ్రమ, ఆరోగ్యము ,మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది అన్నారు. జిహెచ్ఎంసి అతి తక్కువ ఫీజుతో శిక్షణ అందిస్తుంది అన్నారు.1968 నుండి ఈ సమ్మర్ కోచింగ్ క్యాంప్ హైదరాబాదులో  ప్రారంభమయ్యాయి అని అన్నారు.మొoడా డివిజన్ కార్పోరేటర్ దీపిక నరేష్ మాట్లాడుతూ జిహెచ్ఎంసి ద్వారా సమ్మర్ కోచింగ్ క్యాంప్ కావాల్సిన మౌలిక సదుపాయాలను పూర్తిస్థాయిలో కల్పిస్తామన్నారు.ఆటల ద్వారా విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన జీవనశైలి అలవడుతుందన్నారు,విద్యార్థులు వేసవి కాలంలో ఆటలపైనే ఏకాగ్రత చూపించాలని టీవీ మరియు ఫోన్లకు దూరంగా ఉండాలని తెలియజేశారు.యోగ,వాలీబాల్ ,టెన్నిస్ ,టేబుల్ టెన్నిస్ ,స్విమ్మింగ్ ,రోల్లర్ స్కేటింగ్,కరాటే హాకీ,జిమ్నాస్టిక్స్, ఫుట్బాల్, క్రికెట్, బాక్సింగ్ హాకీ, టైక్వాండో,మార్షల్ ఆర్ట్స్ పలు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ లో శిక్షణ అందించనున్నారు.ఈ సందర్భంగా నిర్వహించిన మార్చ్ ఫాస్ట్ కార్యక్రమంలో1వ స్థానం విక్కీ మాస్టర్ గోపన్న మాస్టర్,2వ స్థానం ఆడియా నగర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ వాలీబాల్ విజయ్ మరియు,3వ స్థానం కరాటే కుంగ్-ఫు చందు మాస్టర్ బేగంపేట లను డిప్యూటీ మేయర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో కోచ్లు కె .కృష్ణ, కె .ఆర్ విజయానంద,ఎస్. కుమార్,కె.పి కృష్ణ,ప్రేమ్,మున్నీరు అహ్మద్, నూర్ అహ్మద్,రాకేష్ ,రాజ్ కుమార్ ,జావిద్ మనోరంజన్,అరవింద్,నర్సింలు మరియు కే శ్రీనివాస్  తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.