Tuesday, 3 November 2026

రేణుక ఎల్లమ్మ జీవిత చరిత్ర నాటకం కోసం 15000 రూపాయలు సహాయం అందించిన న్యాల్కల్ జడ్పీటీసీ స్వప్నభాస్కర్

:రేణుక ఎల్లమ్మ జీవిత చరిత్ర నాటకం కోసం 15000 రూపాయలు సహాయం అందించిన న్యాల్కల్ జడ్పీటీసీ స్వప్నభాస్కర్ :జహీరాబాద్ ఏప్రిల్ 4 (జనంసాక్షి) న్యాల్కల్ మండల కేంద్రం బస్టాండ్ సమీపంలో న్యాల్కల్ గ్రామ పెద్దలు నిర్వహిస్తున్న ‘శ్రీ రేణుక ఎల్లమ్మ జీవిత చరిత్ర నాటకం’ కోసం తనవంతు సహాయంగా 15000 రూపాయలు అందచేసిన న్యాల్కల్ జడ్పీటీసీ స్వప్నభాస్కర్.ఈ సందర్భంగా స్వప్నభాస్కర్ మాట్లాడుతూ కులామతాలకు అతీతంగా అన్నీ వర్గాల వారు కలిసిమెలిసి నిర్వహిస్తున్న శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు అందరికి ఉండాలని..అదేవిధంగా దాదాపు 3 నెలల నుండి అందులోని పాత్రలు, సన్నివేశాలు ఎంతో కష్టపడి నేర్చుకుని  మనందరి ముందు ప్రదర్శించే కళాకారులందరికి నా అభినందనలు అనీ తెలిపారు.కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శ్రీనివాస్,నిర్వాహకులు గొల్ల నర్సిములు,ఈశ్వరప్ప,రిపోర్టర్ సిద్దన్న,వార్డ్ మెంబర్స్ బస్వారాజ్,నర్సిములు,స్కూల్ కమిటీ చైర్మన్ బస్వారాజు,ప్రవీణ్,శివన్న, అశోక్,నర్సింహా రాజు,లాళోజి,సుబ్బన్న,మల్లేష్,గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు