జనం సాక్షి,చెన్నారవు పేటమండల కేంద్రానికి చెందిన పల్లకొండ మల్లయ్య గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతూ గురువారం తుదిశ్వాస విడిచారు.మల్లయ్య ఏకలవ్య సంఘం మండల ఉపాధ్యక్షులు గా పని చేస్తూ ఎరుకల హక్కుల సాధన కోసం ఆహర్నిశలు కృషి చేసారు. విషయాన్ని తెలుసుకున్న ఏకలవ్య సంఘం బాద్యులు ఆయన స్వ గృహానికి చేరుకొని మల్లయ్య మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ,మల్లయ్య మృత దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మల్లయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి 3000/- రూపాయల ఆర్థిక సహాయం అందించారు.ఈ కార్యక్రమంలో మండల అద్యక్షులు పులిశెరు జంపయ్య,ప్రధాన కార్యదర్శి పల్లకొండ తిరుపతి, జిల్లా ప్రధాన కార్యదర్శి రాయపురి శ్రీను,పులిశెరు సమ్మయ్య, పులిశెరు రాజేందర్,పులిశెరు వెంకటేష్,పల్లకొండ సారయ్య, పల్లకొండ మల్లయ్య తదితరులు పాల్గోన్నారు.




