బిచ్కుంద ఏప్రిల్ 28 (జనంసాక్షి) గత వారంరోజుల క్రితం కేంద్ర నిధులు ఫుల్ రాష్ట్ర నిధులు నిల్ అనే వార్తపై బిచ్కుంద మండలకేంద్ర పంచాయతీ సెక్రటరీ లక్ష్మణ్ పై బీఆర్ఎస్ బడా నాయకులు ఆగ్రహము వ్యక్తం చేశారు. సెక్రటరీ లక్ష్మణ్ కేంద్ర ప్రభుత్వానికి వత్తాసు పలుకుతావా అని, తమ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతావా అని తనను పిలిపించి ఆగ్రహము చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవం చెబితే ఇలా తనను వేధించడం సబబు కాదని ఆయన తనలో తాను కృంగిపోతున్నారు. తనకు ఇష్టము లేకుండా బిచ్కుంద మేజర్ పంచాయతీకి రప్పించారని అసహనం వ్యక్తం చేశారు. అదేవిధంగా తమకు రెగ్యులర్ చేయమని అనేక సార్లు ఎమ్మెల్యేలకు వినతులు సమర్పించినా సీఎం దృష్టికి తీసుకోపాయారో లేదోనని ప్రశ్నలు గుప్పించారు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ ఫైనాన్స్ కార్పోరేషన్ నిధులు విడుదల చేసి, పంచాయతీ సెక్రటరీలకు రెగ్యులర్ చేయాలని వేడుకున్నారు.




