జనం సాక్షి రాజ్యాంగ రక్షణ కోసం ఉద్యమాలు చేయడమే పూలే అంబేద్కర్‌లకు నివాలిబలహీన వర్గాల బద్ధ శత్రువు బీజేపీకేవిపిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమేల మాణిక్యం . ఎన్టిఆర్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం అడివయ్య .పూలే అంబేద్కర్ జన జాతర సభలో వక్తలుఅటా పాటా సాంస్కృతిక కార్యక్రమాలతో ఉత్సాహంగా ఉత్తేజంగా…
మనువాదం యావత్ మానవాళికి ప్రమాదకరమని రాజ్యాంగ రక్షణ ద్వారా మనువాదాన్ని ప్రతిఘటించాలని భారతదేశ సామాజిక విప్లవానికి సారదులుగా నిలిచిన మహాత్మ జ్యోతిబాపూలే , డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ల్లక్ష్యాలను ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లని కెవిపిఎస్ రాష్ట్ర కమిటీ ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మహనీయుల జన జాతర కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు .అందులో భాగంగానే శుక్రవారం నాడు మెదక్ జిల్లాకేంద్రంలోని ద్వారక గార్డెన్స్ లో జన జాతర కార్యక్రమం ఘనంగా నిర్వహించారు . అనంతరం జరిగిన పూలే అంబేద్కర్ జన జాతర సభ కు ముఖ్యఅతిథిగా KVPS రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమేల మాణిక్యం మాట్లాడుతూ మనువాదానికి భారత రాజ్యాంగానికి మధ్యల దేశంలో ఒక అంతర్యుద్ధం కొనసాగుతుందని మనువాదం మనుషుల్ని ముక్కలు ముక్కలు చేస్తే రాజ్యాంగం మనుషులందరూ సమానం అని మనువాదం అన్ని రకాల అసమానతలకు మూల కారణమైతే భారత రాజ్యాంగంలో మొదటి పేజీలోనే చట్టం ముందు అందరూ సమానులే అని పేర్కొనబడిందని చెప్పారు . నూటికి 50 శాతం మంది గా ఉన్న మహిళలను మనువాదం ఏనాడు మనుషులుగా గుర్తించలేదన్నారు . డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మహిళా హక్కుల కోసం హిందూ కోడ్ బిల్లును ప్రవేశపెట్టి నాటి మనువాద భావజాలం ఉన్న వ్యక్తులు దానిని వ్యతిరేకిస్తే కేంద్ర క్యాబినెట్ మంత్రి పదవికి రాజీనామా చేసి బయటికి వచ్చారని చెప్పారు . భాగంగామనువాద పాలకులు అనుసరిస్తున్న విధానాల మూలంగా హరించబడుతున్న రాజ్యాంగ హక్కులను రక్షించుకోవడానికి అందరూ ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.కేంద్ర బిజెపి సర్కార్ అనుసరిస్తున్న విధానాలు రాజ్యాంగాన్ని రద్దు చేయడానికి దోహదం చేస్తున్నాయన్నారు . ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడం ద్వారా బడుగు బలహీన వర్గాల రిజర్వేషన్లను సమాధి చేస్తుందన్నారు . బీసీ ప్రధాని అని గాప్పాలు కొట్టిన బిజెపి నేతలు ఎందుకు బీసీ కుల గణన చేపట్టడడం లేదని ఆయన ప్రశ్నించారు . బిజెపి పాలిత రాష్ట్రాలలో దళితులు మహిళలపై 300 రేట్లు దాడులు దౌర్జన్యాలు అత్యాచారాలు పెరిగాయన్నారు . మనువాద ఎజెండాతో ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో పరిపాలన చేస్తున్న బిజెపి మనువాద కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తూ పేదలపై పెనుబారాలు మోపుతుందన్నారు. రాజ్యాంగ రక్షణ కోసం రాజకీయాలకతీతంగా ఐక్య ఉద్యమం చేపడుతామన్నారు . రాష్ట్ర NPRD రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆడివయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో , జిల్లాలో దళితులపై దాడులు, దౌర్జన్యాలు, లైంగిక వేధింపులు పెరిగాయని మండిపడ్డారు . KVPS పోరాట ఫలితంగా SC,ST సబ్ ప్లాన్ వచ్చిందని గుర్తుచేశారు , జస్టీస్ పునయ్య కమిషన్ సిఫార్సులు వచ్చినయని అన్నారు. కులవివక్ష రుపలపై ప్రతిఘటన ఉద్యమాలు చేయాలని అన్నారు.దేవాలయ ప్రవేశం చేపించిన చరిత్ర kvps కు ఉందని అన్నారు. ప్రైవేట్ రంగంలో రిజ్వేషన్ల అమలు చేయాలని డిమాండ్ చేశారు. మనువాద ముసుగులో కేంద్ర ప్రభుత్వం పరిపాలన చేయాలని చూస్తుందని అన్నారు. రాజ్యాంగ మౌలిక సూత్రాలను భిన్నంగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని అన్నారు. పౌరహక్కుల దినం ఎందుకు జరపడం లేదని ప్రశ్నించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ఎ. మల్లేశం మాట్లాడుతూ దేశంలో మోడీ అధికారంలోకి వచ్చాక సామాజిక న్యాయానికి తూట్లుపొడుస్తుందని మండిపడ్డారు . మహనీయులు అనేకమంది పోరాటాలు నిర్వహించి సాధించుకున్న కార్మిక చట్టాలు , సామాజిక చట్టాలను ప్రభుత్వం నిర్వీర్యం చేసి మనువాదని తేవాలని కుట్రపనుతుందని అన్నారు . దేశంలో రాజ్యాంగాన్ని కపడుకోవడంకోసం , దేశాన్ని రక్షించుకోవడం కోసం కమ్యూనిస్టులు , అంబేద్కర్ వాదులు కలిసి పనిచేయలని కోరారు . ఈ కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా అధ్యక్షులు సంజీవ , MRPS యువజన సంఘం జిల్లా అధ్యక్షులు బాలరాజు , DBF జిల్లా అధ్యక్షులు సంజీవులు , జై భీమ్ సంఘం జిల్లా అధ్యక్షులు పతురి రాజు , UTF జిల్లా కార్యదర్శి పద్మారావు , సీఐటీయూ జిల్లా కార్యదర్శి , కోశాధికారి బస్వరాజు , నర్సమ్మ , వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కె. మల్లేశం , KVPS జిల్లా అధ్యక్షులు బైల్పాటి గణేష్ , రిటైర్ టీచర్ రామస్వామి , KVPS జిల్లా మాజీ కార్యదర్శి కడారి నాగరాజు , కల్లుగీత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి లచ్చగౌడ్ , SFI జిల్లా కార్యదర్శి సంతు , MRPS సీనియర్ నాయకులు సమేల్ , మురళి , BSP జిల్లా అధ్యక్షులు సురేష్ , ఐద్వా జిల్లా నాయకులు గీత,NPRD జిల్లా ఉపాధ్యక్షులు ఆగమయ్య, వివిధ గ్రామాల నుండి ప్రజలు తదితరులు పాల్గొన్నారు.




