Tuesday, 3 November 2026

ఏకీకృత సర్వీసు రూల్స్‌ ఫైలుపై సీఎం కేసీఆర్ సంతకం

3హైదరాబాద్: ఏకీకృత సర్వీసుల రూల్స్ ఫైలుపై సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆమోద ముద్ర వేశారు. ఇందుకు సంబంధించిన ఫైలుపై ఆయన సంతకం చేశారు. దీనిని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం కోసం పంపనున్నారు. రాష్ట్రపతి ఆమోదం పొందగానే ఏకీకృత సర్వీసు రూల్స్ అమలులోకి రానున్నాయి. కాగా, ఏకీకృత సర్వీసు రూల్స్‌పై సంతకం చేసిన సీఎం కేసీఆర్‌కు ఉపాధ్యాయ సంఘాల నేతలు ధన్యావాదాలు తెలిపారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *