ఏక్లాస్పూర్లో ఇరిగేషన్ కెనాల్ని పరిశీలించిన ఆర్డీవో రాజేశ్వర్.
కోటగిరి డిసెంబర్ 16 జనం సాక్షి:-కోటగిరి మండలం ఏక్లాస్పూర్ గ్రామ శివారులోనీ నిజాంసాగర్ కెనాల్ కి ఇరువైపులా రెవెన్యూ ప్లాంటేషన్ ఏర్పాటు చేస్తామని బోధన్ ఆర్డీవో రాజేశ్వర్ పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆయన శుక్రవారం రోజున ఇరిగేషన్ కెనాల్ డి/28/1 పరిశీలించారు.ఈ కెనాల్ బౌండరీకి ఇరువైపులా రెవెన్యూ ప్లాంటేషన్ ఏర్పాటుకై తగిన చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులకు వారు సూచించారు.ఆయన వెంట కోటగిరి ఎమ్మార్వో శ్రీకాంత్ రావు,ఆర్ ఐ సయ్యద్ అలీ,సర్వేయర్ మల్లికార్జున్,మాజీ వైస్ ఎంపీపీ వల్లేపల్లి శ్రీనివాస్, ఎంపీటీసీ అనంత విఠల్,మండల రెవెన్యూ సిబ్బంది,పట్టేదార్ రైతులు,తదితరులు ఉన్నారు.




