Friday, 6 November 2026

ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన

ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన

ఇటిక్యాల (జనంసాక్షి) డిసెంబర్ 16 మండల పరిధిలోని మునగాల గ్రామంలో జిల్లా కళాకారుల ఆధ్వర్యంలో శుక్రవారం సంక్షేమ పథకాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక జిల్లా కళాకారులు రేలారే ప్రసాద్, కేశవులు, కృష్ణ మాట్లాడుతూ జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి, ప్రజా సంబంధాల సమాచార శాఖ అధికారి చెన్నమ్మ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కళ్యాణలక్ష్మి, షాదిముబారక్, ఆసరా పింఛన్, రైతు బీమా, రైతుబంధు తదితర సంక్షేమ పథకాలపై ఆట పాటల ద్వారా గ్రామస్తులకు అవగాహన కల్పించినట్లు వారు తెలిపారు. అలాగే సీజనల్ వ్యాధులు, పరిసరాల పరిశుభ్రతపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ప్రజలకు వివరించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక సారథి జిల్లా కళాకారులు నర్సింహ, స్వామి, రమాదేవి, కవిత, శైలజ, రాహుల్, భూపతి, హజరత్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.