Thursday, 5 November 2026

ఏక కాలంలో రుణ మాఫీ చేయాలి

కామారెడ్డి జిల్లా సీపీఎం సభ్యులు సురేష్ గొండ
జుక్కల్, జనవరి 22,(జనంసాక్షి),
ఏక కాలంలో రైతులకు రుణ మాఫీ చేయాలని, పోడు రైతులకు పట్టాలు ఇవ్వాలని కామారెడ్డి జిల్లా సిపిఎం సభ్యులు సురేష్ గొండ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.ఆయన ఆదివారం కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం ఖండే బల్లూర్ గ్రామంలో నిర్వహించిన సిపిఎం పార్టి సమావేశంలో మాట్లాడారు. పోడు భూములకు సర్వే చేసిన ప్రభుత్వం ఇప్పటికీ పోడురైతులకు పట్టాలు ఇవ్వక పోవడం శోచ నీయమన్నారు.పోడు రైతులకు పట్టాలు లేని కారణంగా బ్యాంకు రుణాలు పొందలేక పోతున్నారని అన్నారు.రైతుబందు ,రైతు భీమా పొందలేక పోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.పోడు రైతులకు పట్టాలు,ఏక కాలంలో రుణ మాఫీ చేయక పోతే ధర్నా చేస్తామని, రహదారినీ దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మోతిరాం నాయక్, మాజి ఎంపి టి సి కె. రాములు, జుక్కల్ మండల అధ్యక్షుడుబి.ఆడేప్ప, ఆహేమద్, సి హెచ్ హుస్సేన్న, మహిబూబ్ సాబ్, బంగారు పల్లి విట్టల్, కోలా నారాయణ పార్టీ సభ్యులు పాల్గొన్నారు.