ఏటూరునాగారం(జనంసాక్షి):జూన్:10ఏటూరునాగారం బొడ్రాయి 11వ వార్షికోత్సవం సందర్భంగా శనివారం బొడ్రాయి, ముత్యాలమ్మలకు బోనాలను ఇంటి ఆడబిడ్డలు సమర్పించారు. దీంతో బొడ్రాయి, ముత్యాలమ్మ ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. ఇంటి దగ్గర జోడు బోనాలను బెల్లం అన్నం, పులుగ అన్నంతో తయారు చేసుకొని డప్పుచప్పుళ్లతో ముత్యాలకు ప్రథమంగా సమర్పించారు. అనంతరం మేకలు, కోళ్లను బలిచ్చారు. ఆ తర్వాత బొడ్రాయికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అర్చకులు యల్లప్రగడ రాధాకృష్ణశర్మ భక్తులు తెచ్చిన బోనాలను అమ్మవారికి నైవేద్యంగా అందజేశారు. కొబ్బరికాయలు కొట్టి బొడ్రాయి అమ్మవారికి చీరె సారలు, బొట్టు, కాటుక, అద్దం సమర్పించి దీపాలను వెలగించారు. బెల్లం షాకం పోసం చల్లంగా చూడు తల్లి అని వేడుకున్నారు. గ్రామంలోని మహిళలు బోనాలతో పెద్ద ఎత్తున కదలిరావడంతో పండుగ వాతావరణం నెలకొంది. అలాగే నైవేద్యాలను అమ్మవారికి సమర్పించి తీర్థప్రసాదాలను భక్తులు స్వీకరించారు.–– ఆర్టీసీ ఆర్ఎం ప్రత్యేక పూజలు
ఏటూనాగారం గ్రామానికి చెందిన ఆర్టీసీ ఆర్ఎం శ్రీలత శనివారం బొడ్రాయికి మొక్కులను సమర్పించారు. చీరెసారలను సమర్పించి కట్నకానులకు అందజేశారు.–– ముత్యాలమ్మకు వెండి కన్నులు బహుకరణ
మండల కేంద్రంలోని ముత్యాలమ్మకు వెండీ కన్నులను బంగారు షాపు యజమానికి రంగోజు నరేష్చారి దంపతులు బహుకరించారు. అమ్మవారికి కన్నులను అందజేసి మొక్కులు చెల్లించుకున్నారు.
కార్యక్రమంలో పోగుల లక్ష్మినారాయణ, జాస్తి శ్రీకాంత్, సప్పిడి రాంనర్సయ్య, దీనబాంధుస్వామి, పిట్టల శ్రీనివాస్, కత్తెర శ్రీనివాస్, అలువాల శ్రీనివాస్, కుమార్, యాదగిరి, సంతోష్, జయంత్, శ్రీకర్, రమేష్, వెంకట్, కాళ్ల రామకృష్ణ, పిట్టల శివకుమార్, రఘు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
ఏటూరునాగారం బొడ్రాయి 11వ వార్షికోత్సవం




