ఏటూరునాగారం జనంసాక్షి,మే17.ఈ రోజు హైదరాబాద్ లో రోడ్లు, భవనాల మరియు శాసనసభ వ్యవహారాల శాఖామంత్రివేముల ప్రశాంత్ రెడ్డిని,పంచాయితీ రాజ్ శాఖ మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావుని, మరియు గిరిజన& శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు సత్యవతి రాథోడ్ ని కలిసి ములుగు నియోజక వర్గం లోని సమస్యలు వివరించిన ములుగు ఎమ్మెల్యే సీతక్కఈసందర్భంగామాట్లాడుతూ,ఏటూరు నాగారం మండల కేంద్రంలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని ములుగు నియోజక వర్గం వెనుకబడిన ప్రాంతం ఈ ప్రాంత అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ములుగు మండలం లోని జంగాల పల్లి నుండి సర్వాపూర్ వరకు రోడ్డు వైండింగ్ మరియు జంగాల పల్లి గ్రామములో సైడ్ డ్రైనేజీ,శ్రీనగర్ నుండి కొడిశల కుంట రోడ్డు అబ్బా పూర్ సైడ్ డ్రైనేజీ కి నిధులు మంజూరుమంగపేట మండలం కోమటి పల్లి నుండి కటా పూర్ రోడ్డు లకు పూర్తి స్థాయి నిధులు మంజూరు చేయాలని సీతక్క లేఖలో పేర్కొన్నారు.




