ఖానాపూర్ రూరల్17 మే (జనం సాక్షి):హిందూ ధర్మ రక్షణ ప్రతి మహిళ సౌభాగ్యం కొరకై వనిత శక్తి ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరుగుతుందని నిర్మల్ జిల్లా వనిత శక్తి ట్రస్ట్ అధ్యక్షురాలు కోటగిరి శిరీష అన్నారు.శ్రీ శైవ క్షేత్ర పీఠాధిపతులు శ్రీ శివ స్వామిజీ ఆధ్వర్యంలో ప్రతి నెల లో ఒక గ్రామంలోని దేవతలకు సారె సమర్పిస్తు అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పారాయణం చేయడం జరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా గానే బుధవారం ఖానాపూర్ పట్టణం లోని అమ్మవారి ఆలయాలు,వాసవి మాత ఆలయంలో సారెను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రతి మహిళ సౌభాగ్యాo సంతోషం కలగాలని అమ్మకు మన సారే మనసారా అనే నినాదంతో ముందుకు వెళ్తున్నాము అని ఆమె అన్నారు. ఈ సందర్భంగా నిర్మల్ వనిత శక్తి ట్రస్ట్ అధ్యక్షురాలు కోటగిరి శిరీష ను ఖానాపూర్ వాసవి మాత అధ్యక్ష కార్యదర్శి,వనిత శక్తి ట్రస్ట్ వారు సన్మానించారు. ఈ కార్యక్రమంలో వనిత శక్తి మహిళలు గోలి మాధవి,గీత రాణి,వాసవి చిటికేసి,ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు మహాజన్ జితేందర్, కోశాధికారి అవ్వ బుచ్చన్న,ప్రధానకార్యదర్శి అక్కిన పెళ్లి రాజేష్,ఆలయ అర్చకులు సరస్వతి అభిషేక్ శర్మ, వాసవి మాత మహిళలు పాల్గొన్నారు.




