Thursday, 5 November 2026

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మితంగా తనిఖీ డ్యూటీలో లేని సిబ్బంది కి మెమో జారీ కి ఆదేశాలు:ఐటీడీఏ పిఓ అంకిత్

 

కొత్తగూడ జనంసాక్షి:ప్రజలకు ఆరోగ్య రీత్యా ఎల్లవేళలా ఉండవలసిన డాక్టర్ సమయపాలన పాటించకపోవడం,అందుబాటులో లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.మండల కేంద్రంలోని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో ఐటీడీఏ పరిధిలో నిర్వహిస్తున్న సమ్మర్ గేమ్స్ కు ఒక ప్రత్యేకత ఉంది.ఈ గేమ్స్ ని రాష్ట్ర ప్రభుత్వం కొత్తగూడ స్పోర్ట్స్ పాఠశాలలో నిర్వహించాలని ఒక దృఢ సంకల్పంతో ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది.స్పోర్ట్స్ పాఠశాలను మంగళవారం తనిఖీ చేసిన ఐటిడిఎ పి ఓ అంకిత్ అనంతరం వివిధ జిల్లాల నుండి వచ్చిన స్పోర్ట్స్ విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి రీత్యా అందుబాటులో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన ఐటీడీఏ పీవో అంకిత్ హాస్పిటల్ ఏఎన్ఎం తప్ప ఎవరు విధుల్లో లేకపోవడం అసహనం వ్యక్తం చేశారు.ల్యాబ్ గదిలో లైట్లు సైతం వెలగడం లేదు.సిబ్బంది హాజరు రిజిస్టర్ను పరిశీలించి,వైద్యులు ఇతర సిబ్బంది లభ్యతపై అందుబాటులో ఉన్న ఏఎన్ఎంతో ఆరా తీశారు.మహబూబాబాద్లో వైద్యులు సమావేశ వెళ్లినట్లు ఏఎన్ఎం నివేదించారు.డ్రగ్స్ స్టోర్ రూమ్ ఔషధాల లభ్యతను తనిఖీ చేశారు.ప్రయోగశాలను తనిఖీ చేశారు.సెల్ కౌంటర్ పనితీరు టెస్టింగ్ కిట్లు రియాజెంట్ల లభ్యత మొదలైన వాటిపై ఆరా తీశారు.నేటి వైద్యులు సిబ్బంది హాజరు వివరాలను విచారించాలని గైర్హాజరైన సిబ్బందికీ మెమో జారీ చేయాలని డిప్యూటీ జిల్లా వైద్యఆరోగ్య అధికారి (ఏజెన్సీ)కి ఆదేశించారు.