ఏటూరు నాగారం ( జనం సాక్షి)జూన్ 08ఏటూరు నాగారం మండల కేంద్రంలోని నాభిశిల బొడ్రాయి కొలుపు ఉత్సవాలు గురువారం అత్యంత వైభవంగా నిర్వహించారు. బొడ్రాయి నెలకొల్పి 10 సంవత్సరాలు పూర్తి అయి 11వ వార్షికోత్సవం సందర్భంగా బొడ్రాయి ఉత్సవాలను ఉదయం పోత TVరాజు, భూలపల్లి, బొడ్రాయికి జలాభిషేకం, పాలభిషేకాలను అర్చకులు యల్లప్రగడ రాధాకృష్ణశర్మ భక్తులతో జరిపించారు. విద్యుత్ దీపాలను అలంకరించారు. అలాగే మండపారాదాన, హోమం, గోవు పూజ కార్యక్రమాలను చేపట్టారు. కార్యక్రమంలో సర్పంచ్ ఈసం రామ్మూర్తి, పోగుల లక్ష్మినారాయణ, పిట్టల శ్రీనివాస్, దీనభాందుస్వామి, కత్తెర శ్రీనివాస్, అలువాల శ్రీనివాస్, జాస్తి శ్రీకాంత్, సప్పిడి రాంనర్సయ్య, కాళ్ల రామకృష్ణ, జయంత్, శ్రీకర్, గండెపల్లి నర్సయ్య, ఖాజా, గుండ్లపల్లి సత్యం, గుండ్లపల్లి నాగరాజు, బిల్ల శ్రీను, బిల్ల నాగరాజు, బేతి భాస్కర్, కనకయ్య పాల్గొన్నారు.
–– జెడ్పీ చైర్మన్ పూజలుబొడ్రాయి ఉత్సవాల సందర్భంగా జెడ్పీ చైర్మన్ జగదీష్ ఏటూరునాగారం బొడ్రాయి ఉత్సవాలకు హాజరై జలాభిషేకం, పాలాభిషేకం చేసి ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు అశీర్వచనం అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ అంతటి విజయ, జెడ్పీ కోఆప్షన్ సభ్యురాలు వలియాబీ, మండల పార్టీ అధ్యక్షుడు సునీల్‌కుమార్, తుమ్మ మల్లారెడ్డి, సప్పిడి రాంనర్సయ్య పాల్గొన్నారు. హోమంలో పూజలు
బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు కాకులమర్రి లక్ష్మణ్‌బాబు హోమంలో పూజలు చేసి బొడ్రాయికి జలాభిషేకం చేశారు. పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో తాడూరి రఘు, ఎంపీపీ విజయ, ప్రదీప్‌రావు పాల్గొన్నారు.
ఏటూరు నాగారం మండల కేంద్రంలో ఘనంగా నాభిశిల బొడ్రాయి ఉత్సవాలు




