ఏడి హద్దులు సక్రమంగానే ఏర్పాటు చేశారు
సైదాపూర్ జనంసాక్షి, నవంబర్ 27
లస్మన్నపల్లి గ్రామానికి చెందిన రైతులకు సంబంధించిన భూముల్లో కరీంనగర్ భూముల కొలతల అసిస్టెంట్ డైరెక్టర్ సక్రమంగానే హద్దులు నిర్ణయించారని ఆ గ్రామ రైతులు ఆదివారం తెలిపారు. గ్రామానికి చెందిన మ్యాకల రాజిరెడ్డి అనే రైతు విలేకరులతో మాట్లాడుతూ..
గత కొద్దిరోజులుగా సోమారం గ్రామ శివారులోని 109,110 సర్వే నంబర్లలోని భూముల్లో హద్దులు సక్రమంగా లేవని మొదటగా మండల సర్వేర్ కు దరఖాస్తు చేశానన్నారు.2010లో మండల సర్వేయర్ సక్రమంగా హద్దులు నిర్ణయించినప్పటికీ తమకు వచ్చే భూమిని పక్క రైతులైన మ్యాకల లక్ష్మారెడ్డి, మ్యాకల శ్రీనివాస్ రెడ్డిలు ఇవ్వలేదని తెలిపారు. దీంతో మళ్లీ 12 ఏళ్ల తర్వాత వారు కరీంనగర్ చెందిన రవీందర్ రెడ్డి అనే వ్యక్తికి వారి భూములను అమ్ముకున్నారన్నారు. ఈ నేపథ్యంలో తనకు భూమి తక్కువగా ఉందని హుజురాబాద్ డిఐ కి దరఖాస్తు చేసుకోగా కొలతలు నిర్ణయించి అస్తవ్యస్తంగా హద్దులు ఏర్పాటు చేశాడని తెలిపారు. అనంతరం కరీంనగర్ జిల్లా భూమి కొలతల అసిస్టెంట్ డైరెక్టర్ కు దరఖాస్తు చేసుకోగా వారు గత మూడు రోజుల క్రితం కొలతలు నిర్ణయించారని చెప్పారు. అట్టి కొలతలు సక్రమంగా ఉన్నప్పటికీ తమ పక్కన ఉన్న రైతులు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్ణయించిన హద్దుల ప్రకారం తాను భూమి కొలతలు నిర్ణయించుకుంటానని తనకు పక్క రైతుల చే ప్రాణభయం ఉన్నదని వారిచే రక్షణ కల్పించాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. భూమి ఇతరులకు విక్రయించిన వారి భూమి గానీ తనపై దౌర్జన్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. పక్క రైతులకు అభ్యంతరం ఉంటే పై అధికారులకు దరఖాస్తూ చేసుకోవాలి కానీ స్థానికంగా తమపై దౌర్జన్యం చేస్తూ ఇబ్బందుకు గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.




