Saturday, 7 November 2026

టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర మహా సభలకు భారీగా తలివెళ్లిన జర్నలిస్టులు

టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర మహా సభలకు భారీగా తలివెళ్లిన జర్నలిస్టులు

జహీరాబాద్ నవంబర్ 27 (జనం సాక్షి): హైద్రాబాద్ లోని ఆర్టీసీ కళ్యాణ వేదిక బాగ్ లింగంపల్లి వద్ద జరిగే తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ( టిడబ్ల్యూజేఎఫ్ ) రెండవ రాష్ట్ర మహాసభలకు నియోజకవర్గంలో ని ఆయా మండలాల్లో పట్టణం లో పని చేస్తున్న జర్నలిస్టులు భారీగా తరలివెళ్లారు. ఆదివారం స్థానిక ఐబి అతిథి గెస్టు హౌజ్ నుండి జర్నలిస్టులు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి విలేఖరికి అక్రిడేషన్ కార్డు, ,
ఇండ్ల స్థలాల, హెల్త్ కార్డులు రైల్వేపాసులు, బస్సు పాసులు, ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు టీడబ్ల్యూజేఎఫ్ ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటాలు చేస్తుందన్నారు. తెలంగాణలో అక్రిడిటేషన్ లు పెరిగిన మాట వాస్తవమే చిన్న, మధ్యతరహా పత్రికలకు పూర్తిస్థాయిలో న్యాయం జరగలేదని తెలిపారు.టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు మాణి కొండ బస్వరాజు, పబ్బతి సంతోష్ కుమార్ కార్యదర్శులు మహబూబ్ అలీ రాయికోటి నర్సిములు, డివిజన్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ శాస్త్రి ఫెడరేషన్ నాయకులు రోషన్, హరిక్రిష్ణ,మహారుద్రయ్య స్వామి,అబ్దుల్లా, బట్టు పురుషోత్తం, నర్సిములు అశోక్, ఖలిల్,రమేష్,ప్రసాద్, పోచయ్య, తదితరులు పాల్గొన్నారు.