వైస్సార్ టీపీ నాయకుల సంబరాలు.
బెల్లంపల్లి, నవంబర్ 27, (జనంసాక్షి )
వైస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైస్ షర్మిల చేపట్టిన పాదయాత్ర ఆదివారం నాటికి 222 రోజులు, 3500 కిలో మీటర్లు పూర్తి చేసుకున్న సందర్బంగా నాయకులు సంబరాలు చేసుకున్నారు. బెల్లంపల్లి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా లో వైయస్సార్ తెలంగాణ పార్టీ అసెంబ్లీ కోఆర్డినేటర్ కాశీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో బాణా సంచాలు కాల్చి, కేక్ కట్ చేసి సంబరాలు ఘనంగా జరుపుకున్నారు
ఈ కార్యక్రమానికి మంచిర్యాల జిల్లా మహిళా అధ్యక్షురాలు కల్పన జాగటి పాల్గొని మాట్లాడుతూ షర్మిలమ్మ ముఖ్యమంత్రి అయ్యేంతవరకు మహిళలందరము అహర్నిశలు కృషి చేస్తాము అని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షురాలు నిర్ల పద్మ, సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు గాదె సాయి, ఎస్సి సెల్ జిల్లా నాయకుడు ముల్కల రాజేంద్ర ప్రసాద్, బెల్లంపల్లి పట్టణ అధ్యక్షుడు గోసిక సంపత్, మండల అధ్యక్షుడు అదేర్ల మహేందర్, పట్టణ ప్రధాన కార్యదర్శి లింగంపల్లి సురేష్, ఉపాధ్యక్షుడు వెంకటేష్, అజయ్, మహేష్, నరేష్ బెల్లంపల్లి పట్టణ అధ్యక్షురాలు బోయిన కవిత, తులసి, పద్మ, రమాదేవి, అనూష, లావణ్య, స్వప్న, లక్ష్మి, శిరీష, పాల్గొన్నారు.
వైస్సార్ టీపీ నాయకుల సంబరాలు.




