హయత్‌నగర్: డివిజన్ పరిధిలోని వర్డ్ అండ్ డీడ్ పాఠశాల ఎదురుగా ట్రాన్స్‌పోర్టు కంపెనీ సమీపంలో బహిరంగగా పేకాట ఆడుతున్న వారిపై నిన్నరాత్రి పోలీసులు దాడులు జరిపారు. ఏడుగురిని అదుపులోకి తీసుకుని రూ. 25,100 నగదు , 3 ద్విచక్రవాహనాలు. ఏడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను ఈ రోజు కోర్టులో హాజరుపరచనున్నట్లు ఎస్సై శ్రీనాథ్ తెలిపారు.




