ఏడుపాయల బ్రిడ్జి నిర్మాణంతో భక్తులకు దూర భారం తగ్గింది

* రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత రెడ్డి*

ఏడుపాయల దుర్గమ్మ దయతో నియోజకవర్గ అభివృద్ధి * ఎమ్మెల్యే మదన్ రెడ్డి

జనం సాక్షి /కొల్చారం ఏడుపాయల బ్రిడ్జి నిర్మాణం వల్ల భక్తులకు దూర భారం తగ్గిందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ వాకిటి సునీత లక్ష్మారెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి అన్నారు మెదక్ జిల్లా కొల్చారం మండల పరిధిలోని పోతన శెట్టిపల్లి చౌరస్తా వద్ద ఏడుపాయల దేవస్థానం కు వెళ్లే రహదారిని నూతన బ్రిడ్జి నిర్మాణం చేపట్టగా నేడు ఆ బ్రిడ్జిని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఏడుపాయల అమ్మవారి దర్శనం కోసం వెళ్లాలంటే ఎంతో ఇబ్బంది పడేవారు అని వర్షాలు వచ్చినప్పుడు నది ఉధృతి పెరగడం వల్ల ఎంతోమందికి ఇబ్బందులు ఏర్పడ్డాయని నేడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భక్తుల సౌకర్యం బ్రిడ్జి నిర్మాణం చేపట్టినట్టు వారు తెలిపారు ఈ సందర్భంగా అంశం పల్లి గ్రామానికి చెందిన గోల్పల శేఖరయ్యకు ఒక లక్ష యాభై వేల రూపాయల ఎల్ వో సి అందజేశారు. అలాగే మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్టర్ శ్రీపాల్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మెదక్ డిఎస్పి సైదులు, జెడ్పిటిసి మేఘమాల సంతోష్ , ఎంపీపీ మంజుల కాశీనాథ్, మెదక్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సావిత్రి రెడ్డి, ఇరిగేషన్ ఇ ఇ యేసయ్య, డిప్యూటీ ఎంఆర్ వో కిషోర్, మండల గౌడ సంఘం అధ్యక్షుడు వెంకట్ గౌడ్, బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గౌరీ శంకర్, బి ఆర్ఎస్ యువత అధ్యక్షుడు కోనాపూర్ సంతోష్ రావు, పోతంశెట్టిపల్లి సర్పంచ్ నాగరాణి నరసింహులు, ఎంపిటిసి భాగ్యలక్ష్మి సిద్ధిరాములు, వివిధ గ్రామాల సర్పంచులు మన్నె శ్రీనివాస్, నెల్లికిష్టయ్య, రమేష్, మోతి పాండు నాయక్, బండి సుజాత రమేష్, ఏడుపాయల డైరెక్టర్ కొమ్ముల యాదగౌడ్, గౌరీ శంకర్ తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు