నాంపల్లి జనవరి 16 (జనం సాక్షి) నాంపల్లి మండలం స్వాములవారి లింగోటం గ్రామానికి చెందిన రైతుబంధు మండల కన్వీనర్ ఏడు దొడ్ల రవీందర్ రెడ్డి తండ్రిగారైన ఏడు దొడ్ల శ్రీనివాస్ రెడ్డి ప్రథమ వర్ధంతి, విగ్రహావిష్కరణ స్వ గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విద్యుత్ శాఖ మంత్రి గుంట కండ్ల జగదీశ్వర్ రెడ్డి హాజరై శ్రీనివాస్ రెడ్డి విగ్ర ఆవిష్కరణ ఆవిష్కరణ చేసి,చిత్రపటానికి పూలమాలలు వేసి, ప్రగడ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే రవికుమార్ నాయక్,భువనగిరి ఎమ్మెల్యే పైలా శేఖర్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే చిడమర్తి లింగయ్య, స్థానిక జడ్పిటిసి ఎలుగోటి వెంకటేశ్వర్ రెడ్డి, మర్రిగూడెం జడ్పిటిసి పాశం సురేందర్ రెడ్డి, సర్పంచులు, ఎంపిటిసిలు తదితరులు పాల్గొన్నారు.
ఏడు దొడ్ల శ్రీనివాస్ రెడ్డి ప్రధమ వర్ధంతి, విగ్ర ఆవిష్కరణ చేసిన మంత్రి జగదీశ్వర్ రెడ్డి




