వియత్నాం : కమ్యూనిస్ట్ ప్రభుత్వం పై అభాండాలు వేస్తూ నిందోరోపణలతో బ్లాగ్‌లో పోస్ట్ రాసినందుకు ఓ వ్యక్తిని అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. గత నెలరోజుల్లో పోలీసులు ఓ బ్లాగర్‌ను అరెస్టు చేయడం ఇది మూడోసారి. దిన్హ్ నాట్ ఉయ్ అనే వ్యక్తిని ఈ నేపథ్యంలో శనివారం అరెస్టు చేసినట్లు ఓ ప్రముఖ వార్తా పత్రిక ప్రచురించింది. ఈనేరంపై కనీసం 7సంవత్సరాల జైలు శిక్ష విధించే అవకాశం ఉన్నట్లు తెలియజేశారు. గత నెలలో దిన్హ్ నుయాస్ ఖా అనే విద్యార్థి ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యలు చేసినందుకు అతనికి 8 సంవత్సరాలు జైలు శిక్ష విధించారు.




