హైదరాబాద్: గ్రూప్-2 నాన్‌ఎగ్జిక్యూటివ్ పోస్టుల ఫలితాలు విడుదల చేయాలని అభ్యర్థులు ఏపీపీఎస్సీ ముందు ఆందోళనకు దిగారు. 2011లో ఇంటర్వ్యూలు పూర్తి చేసినప్పటికే ఇంత వరకూ ఫలితాలు వెల్లడిచేయకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమతోపాటు పరీక్షలు రాసిన ఎగ్జిక్యూటివ్ అభ్యర్థులకు పోస్టులు ఇచ్చారని అన్నారు. వారం రోజుల్లో ఫలితాలు ప్రకటించకపోతే ఏపీపీఎస్సీని ముట్టడిస్తామని హెచ్చరించారు.




