అలహాబాద్: ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్ రైల్వేస్టేషన్‌లో తొక్కిసలాట ఘటన బాధితులు ఆందోళనకు దిగారు. అధికారుల నుంఇ సరైన స్పందన లేదుంటూ మృతుల బంధువులు నిరసన చేపట్టారు. మృతదేహాలపై కప్పె గుడ్డ కోసం కూడా తమను ఆసుపత్రి సిబ్బంది డబ్బులు అడిగారని ఆరోపిస్తూ ప్రభుత్వ ఆసుపత్రి ముందె అలహాబాద్ డివిజనల్ కమిషనర్‌ను అడ్డుకున్నారు. మృతుల వివరాల జాబితాను వెంటనే విడుదల చేయాలని కోరారు. వివిధ ప్రాంతాలకు వెళ్లే రైళ్ల సమాచారాన్ని అందించడంతో రైల్వే అధికారులు విఫలమయ్యారని ఆరోపించారు. కుంభమేళాకు నిన్న భక్తులు పోటెత్తడంతో అలహాబాద్ రైల్వేస్టేషన్‌లో తొక్కిసలాట జరిగిన 36 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.




