ఏపీలో కొత్తగా 304 కరోనా పాజిటివ్ కేసులు
హైదరాబాద్: ఏపీ కరోనా కేసుల తాజా బులెటిన్‌ను వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసింది. ఏపీలో కొత్తగా 304 మందికి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో ఏపీకి చెందిన వారు 246 మంది కాగా, ఇతర రాష్ట్రాలకు చెందిన 52 మంది, విదేశాలకు చెందినవారు 8 మంది కరోనా వైరస్ బారినపడ్డారు. గత 24 గంటల్లో 15, 173 శాంపిల్స్‌ను పరీక్షించగా 246 మంది కోవిడ్ -19 పాజిటివ్‌గా తేలారు. 47 మంది కోవిడ్ నుంచి తేరుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. కర్నూల్, అనంతపురం జిల్లాలలో ఒక్కొక్కరు మరణించారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం 5087 కేసుల్లో 2770 మంది డిశ్చార్జ్ కాగా 86 మంది మరణించారు. ప్రస్తుతం 2231 మంది చికిత్స పొందుతున్నారు.