– గడ్కరీకి హరీష్ రావు లేఖ
హైదరాబాద్, అక్టోబర్30(జనంసాక్షి) : కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి తెలంగాణ ఆపద్ధర్మ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. ఆంధప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా నీటిని తరలించేందుకు ఎత్తిపోతల పథకం నిర్మించబోతోందని ఫిర్యాదు చేశారు. తుంగభద్ర నదీ జలాలను 40 టీఎంసీల వరకు అనంతపురం తరలించేందుకు ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారని లేఖలో ప్రస్తావించారు. ఆంధప్రదేశ్ సర్కార్ ఇప్పటికే జీవో జారీ చేసిందని.. వెంటనే ఈ ఎత్తిపోతలను ఆపాలని లేఖలో హరీష్‌రావు కోరారు. విభజన చట్టం ప్రకారం ప్రాజెక్టు డీపీఆర్‌ను కేఆర్‌ఎంబీకి, తెలంగాణ ప్రభుత్వానికి పంపాలని కోరారు. కేఆర్‌ఎంబీ పరిశీలన తర్వాత అపెక్స్ కౌన్సిల్‌కి నివేదించాలన్నారు. కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ అపెక్స్ కౌన్సిల్ అనుమతి తర్వాతనే ప్రాజెక్టు పనులను కొసాగించాలన్నారు. కాని ఏపీ ప్రభుత్వం ఇవేవిూ పట్టించుకోకుండా.. ఎలాంటి అనుమతులు లేకుండా, సమాచారం ఇవ్వకుండా ఏపీ ప్రాజెక్టును నిర్మిస్తోందన్నారు హరీష్‌రావు లేఖలో పేర్కొన్నారు.
ఏపీ ప్రాజెక్టును అడ్డుకోండి




