ఏపీ సీఎం చంద్రబాబుకు  శుభాకాంక్షల వెల్లువ


– జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మోదీ, జగన్‌, కేటీఆర్‌
– బాబును కలిసి శుభాకాంక్షలు తెలిపిన తెదేపా నేతలు
అమరావతి, ఏప్రిల్‌20(జ‌నంసాక్షి) : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని  పురస్కరించుకుని ఆయనకు పలువురు రాజకీయ ప్రముఖులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు సైతం బాబుకు ట్విట్టర్‌ ద్వారా శుభాకాంక్షలు అందజేశారు. ట్విట్టర్‌ వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన మోదీ.. ‘ఆంధప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు’.. ఆయన ఆయురారోగ్యాలతో చిరకాలం ఉండాలని కోరుకుంటున్నారంటూ మోదీ ట్వీట్‌ చేయడం విశేషం. అదేవిధంగా జగన్‌ సైతం ‘చంద్రబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు అంటూ ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం 70వ వసంతంలోకి అడుగుపెడుతున్న చంద్రబాబు రోజంతా బిజీగా గడపనున్నారు. చంద్రబాబు 69వ పుట్టిన రోజును టీడీపీ కార్యకర్తలు, ఆయన అభిమానులు పెద్దఎత్తున జరుపుతున్నారు. ఉదయం 9 నుంచి ఉండవల్లిలోని ఆయన నివాసంలో పార్టీ నేతలు, అభిమానులను కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా తనయుడు లోకేశ్‌ సైతం ట్విట్టర్‌ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. విూరు దార్శినికుడిగా, సమర్ధవంతమైన నేతగా ప్రపంచానికి తెలుసు.. అయితే, మంచి భర్త, తండ్రిగానే కాదు, ప్రస్తుతం గొప్ప తాతగానూ మిమ్మళ్లి దగ్గర నుంచి చూస్తోన్న నేను చాలా అదృష్టవంతుడ్ని.. రాబోయే రోజుల్లో మరింత శక్తివంతంగా, ఉత్సాహంగా ఉండాలని కోరుకుంటున్నానని లోకేశ్‌ ట్వీట్‌ చేశారు. అదేవిధంగా టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘చంద్రబాబు గారికి హార్థిక జన్మదిన శుభాకాంక్షలు’.. విూకు ప్రశాంతమైన, ఆరోగ్యకరమైన జీవితాన్ని ప్రసాదించాలని భగవంతుడిని కోరుతున్నా. సమాజ సేవలో విూరు మరెన్నో సంవత్సరాలు గడపాలని ఆకాంక్షిస్తున్నా అంటూ కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. ప్రముఖ సినీ రచయిత, నటుడు పరుచూరి గోపాలకృష్ణ చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన నిండునూరేళ్లు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ట్విట్టర్‌లో శుభాకాంక్షలు తెలుపుతూ.. ‘అలుపెరుగని శ్రామికుడు, అపర చాణక్యుడు ,అమరావతీ రాజధాని నిర్మాణ చతురుడు, గౌరవ్యులు శ్రీ నారా చంద్ర బాబుగారికి జన్మదిన శుభాకాంక్షలు.. శతమానం భవతు.. అని ట్వీట్‌ చేశారు.